Big Stories

Indians: విదేశాలకు క్యూ కడుతున్న భారతీయులు.. దేశాన్ని వీడిన 1.8 కోట్ల మంది

Indians: విదేశాలకు వలసలు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మెరుగైన జీవితం, ఉపాధి, విద్య కోసం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో విదేశాలకు వలసలు వెళ్తున్నారు. అభివృద్ధిలో ముందున్న అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్ వంటి దేశాలకు ఎక్కువగా క్యూ కడుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వలసలు వెళ్తున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇంటర్నేషనల్ మైగ్రేషన్ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది.

- Advertisement -

2020 నాటికి 1.80 కోట్ల మంది భారతీయులు దేశం విడిచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిపోయారు. 2020లో 7.20 లక్షల మంది, 2021లో 8.30 లక్షల మంది భారతీయులు విదేశాలకు వలసలు వెళ్లారు. ఇక భారతీయులు అత్యధికంగా వలసలు వెళ్తున్న దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మొదటిస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 35 లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్లి స్థిరపడిపోయారు.

- Advertisement -

ఇక యూఏఈ తర్వాత భారతీయులు అత్యధికంగా వలసలు వెళ్తున్న దేశం అమెరికా. ఆ తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ వంటి దేశాలు ఉన్నాయి. అలాగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2021లో 4.4 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు.

Pak woman: గేమింగ్ యాప్‌లో ప్రేమాయణం.. దేశం దాటి వచ్చిన యువతి.. చివరికి..

School: ఆ స్కూల్లో ఒక్కరే స్టూడెంట్.. ఒక్కరే టీచర్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News