
Roja Movie Heroine : హీరోయిన్లకు సినీ పరిశ్రమలో ఎక్కువగా లైఫ్‌స్పాన్ ఉండదని అందరూ అంటుంటారు. అది తప్పు అని ప్రూవ్ చేస్తూ.. పలువురు సీనియర్ హీరోయిన్లు.. ఇంకా సీనియర్ హీరోల సరసన నటిస్తూ.. బ్లాక్‌బస్టర్ హిట్లు కొడుతూ తమ కెరీర్‌ను జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడిప్పుడే కొందరు సీనియర్ హీరోయిన్లు కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అలా కమ్‌బ్యాక్ ఇచ్చిన వారిలో మధూ కూడా ఒకరు. తాజాగా అసలు తను సినీ పరిశ్రమకు దూరమవ్వడానికి గల కారణాన్ని బయటపెట్టింది.
‘రోజా’ అనే సినిమాతో కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినీ లవర్స్ అందరికీ హీరోయిన్‌గా పరిచమయమయ్యింది మధూ. నటిగా ఈ సినిమాతో తనకు ఎంతో గుర్తింపు లభించింది. ఆ తర్వాత తను హీరోయిన్‌గా నటించిన పలు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆపై బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంది. కానీ హఠాత్తుగా ఆమె స్క్రీన్‌పై మాయిమయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లుగా తల్లి పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అసలు తను సినిమాల నుండి బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటో మధూ బయటపెట్టింది.
‘నేను 90ల్లో పలువురు యాక్షన్ హీరోలు నటించిన సినిమాల్లో భాగమయ్యాను. నాకు దాని గురించి ఎలాంటి ఫిర్యాదులు లేవు. నేను చాలా సినిమాల్లో డ్యాన్స్ చేశాను. నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం. కానీ రోజా లాంటి సినిమాలో నటించి మళ్లీ కేవలం డ్యాన్స్ చేసే పాత్రలు చేయాలంటే నాకు సంతోషంగా అనిపించలేదు. షూటింగ్ డేట్స్ వచ్చాయంటే చాలు.. చాలా దిగులుగా అనిపించేది. అప్పుడే సినిమాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే సినిమాలు మానేస్తున్నానని లెటర్ రాశాను. క్షణికావేశంలో అలా చేశాను కానీ ఆ తర్వాత నేను ఒక ఆర్టిస్ట్ అని గ్రహించాను. అందుకే మళ్లీ తిరిగొచ్చాను.’ అంటూ మధూ అసలు కారణాన్ని బయటపెట్టింది.
ఇప్పుడు తనకు వస్తున్న అవకాశాల గురించి కూడా మధూ స్పందించారు. ‘నాకు ఏజింగ్‌తో ఎలాంటి సమస్య లేదు. కానీ సరైన రోల్స్ రాకపోవడమే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నేను అజయ్ దేవగన్‌కు అమ్మలాగా అయితే అస్సలు నటించను. మేము కలిసి లాంచ్ అయ్యాము. మాది ఒకటే వయసు. కానీ రోజులు మారుతున్నాయి. ఇండస్ట్రీలో వస్తున్న మార్పులకు నాకు చాలా సంతోషంగా ఉంది.’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది మధూ. చివరిగా ‘శాకూంతలం’ సినిమాలో మేనకగా కనిపించింది మధూ.