BigTV English

Air Pollution : సముద్రాల అలల నుండి కూడా గాలి కాలుష్యం..

Air Pollution : సముద్రాల అలల నుండి కూడా గాలి కాలుష్యం..

ప్రస్తుతం కాలుష్యం అనేది అందరినీ వెంటాడుతున్న సమస్య. అందులోనూ ముఖ్యం గాలి కాలుష్యం అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. రోజురోజుకీ కాలుష్యం ఎక్కువ అవుతుందే తప్పా.. దానిని అదుపు చేసే మార్గం మాత్రం కనిపించడం లేదు. శాస్త్రవేత్తలు ఈ విభాగంలో ఎన్నో పరిశోధనలు చేస్తూ.. దీనిని అదుపు చేసే మార్గాలు కనుక్కుంటున్నా.. అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. తాజాగా గాలి కాలుష్యానికి మరో కొత్త కారణాన్ని వారు కనుగొన్నారు.


ఒక కాలుష్యం అనేది మరో కాలుష్యానికి దారితీస్తుంది. అందుకే ఒకటి అదుపులోకి తీసుకురాగలిగితే.. మిగిలినవి కూడా ఆటోమేటిక్‌గా అదుపులోకి వస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతారు. తాజాగా సముద్రంలో కలుస్తున్న మురుగునీరు కారణాంగా గాలి కాలుష్యం ఏర్పడుతుందని వారు కొనుగొన్నారు. మురుగునీరు సౌత్ కౌంటీలోని సముద్రాల్లో కలవడం వల్ల అక్కడి బీచ్‌లు కూడా గాలి కాలుష్యానికి కారణమవుతున్నాయని శాన్ డియాగో శాస్త్రవేత్తలు వారు తెలిపారు. మురుగునీరు కలిసిన సముద్రంలో అలలు ఏర్పడినప్పుడు దానినుండి కాలుష్యం వెలువడుతుందన్నారు.

సముద్రం నుండి గాలి కాలుష్యాం ఏర్పడుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు.. క్యాలిఫోర్నియాలో ఇంపీరియల్ బీచ్‌పై పరిశోధనలు చేశారు. 2019లో జనవరి నుండి మే వరకు దీనిపై పరిశోధనలు జరిగాయి. సముద్రం నుండి వస్తున్న అలల్లో బ్యాక్టిరియా ఉంటుందని వారు గమనించారు. అయితే మురుగునీరు సముద్రంలో కలవడం వల్ల కేవలం నీటి కాలుష్యమే కాకుండా గాలి కాలుష్యం కూడా ఏర్పడుతుందని వారు అన్నారు.


మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల నీటి కాలుష్యం నుండి ప్రజలను కాపాడడం ఇబ్బందిగా మారిందని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. ఇంపీరియల్ బీచ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఆ నీటిలోకి వెళ్లకపోయినా.. నీటి కాలుష్యం వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉరుములు, మెరుపులు సముద్రాన్ని తాకి అలల వేగాన్ని పెంచినప్పుడు..వాటి వల్ల బ్యాక్టీరియా శాతం పెరిగినట్టుగా వారు గమనించారు. సీజన్‌తో సంబంధం లేకుండా ఇంపీరియల్ బీచ్ ప్రాంతంలో ఎప్పటికప్పుడు కాలుష్యం పెరుగుతూ వస్తుందని తెలిపారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×