E-Paper
Advertisement

Basikam :బాసికం ఎందుకు కడతారు..?

Basikam  :బాసికం ఎందుకు కడతారు..?
Advertisement

Basikam :పెళ్లంటే నూరేళ్ల పంట. అప్పటి వరకు తమ దగ్గరే బిడ్డను మరో ఇంటికి కోడలిగా పంపిస్తారు వధువు తల్లిదండ్రులు. పెళ్లికి ముందు బాధ్యత లేకుండా కొడుకు పెళ్లికాగానే కొత్త బంధంతో కొత్త బాధ్యతలతోసంసార జీవితం ప్రారంభిస్తాడు వరుడ. అలాంటి పెళ్లిళ్లు సంప్రదాయాలను, ఆచారాలు బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా వివాహ సమయంలో వధూవరులను అందంగా అలంకరిస్తారు. వారి అలంకరణను చూసి అతిథులు, బంధువులు ముగ్దులవుతారు. అలా అందరూ చూసేటప్పుడు వారిపై కనుదృష్టి పడుతుంది. వాటిని నుంచి రక్షణ పొందడానికే బ్రహ్మ కొలువున్న ఈ స్థానంలో బాసికాన్ని కడతారు.

శరీరంలో మొత్తం 72వేల నాడులు వుంటాయి. అందులో 14 నాడులు ఎంతో ముఖ్యమైనవి. వీటివల్ల మానవ శరీరంలో ఎల్లప్పుడూ ఉత్తేజ పరిస్థితిలో వుంటుంది. అయితే ఈ 14 నాడుల్లో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు చాలా కీలకం. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపున సూర్యనాడి… ఎడమవైపు చంద్రనాడులు వుంటాయి. ఈ రెండు నాడులు కలిసే ప్రాంతం ముఖంలోని నుదుట మధ్య భాగం. ఈ రెండు నాడుల కలయిక అర్థచంద్రాకారంలో వుంటుంది. దీనిపై ఇతరుల దృష్టి పడి దోషం కలగకుండా వుండేందుకు వధూవరుల నుదుటన బాసికం కడతారు.

Advertisement

వధూవరులిద్దరికీ కళ్యాణ తిలకం దిద్ది నుదిటిపై బాసికం కట్టినప్పుడే అసలైన పెళ్లి కళ ఉట్టిపడుతుంది. ఈ బాసికం కట్టడం వెనుక కూడా ఒక శాస్త్రీయ పరమార్థం కూడా దాగి ఉంది. పెళ్లిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం సుముహూర్తం. ఈ సమయంలో వరుడు వధువు మెడలో మూడుముళ్లు వేస్తాడు. ఆ మూడు ముళ్ళు వేసే సమయంలో వరుడు వధువు కనుబొమ్మల మధ్య చూడాలి.

వధువు వరుడు రెండు కనుబొమ్మల మధ్య చూడాలి. ఈవిధంగా ఒకరికొకరు చూడటం మర్చిపోకుండా దృష్టి పక్కకు వెళ్ళకుండా ఉండడం కోసం నుదుటిపై బాసికం కడతాడు. ఈ విధంగా ఒకరినొకరు చూసుకోవడం వల్ల వారిద్దరికీ ఒకరి పై ఒకరికి ఆకర్షణ కలిగి వారిద్దరూ ఇకపై జీవితంలో ఒక్కటేనన్న భావన కలిగి సంసార జీవితంలో ఎటువంటి కలహాలు, మనస్పర్థలు లేకుండా నూరేళ్లు జీవించాలని అర్థం.

Advertisement

Chaitra Month : చైత్ర మాసం అందుకే అంత ప్రత్యేకమా…

Ellora : ఎల్లోరాలో ఏలియన్స్ సంచరించాయా……

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×