E-Paper
Advertisement

Adipurush Dialogue : ఇండియన్ సినిమాలు బ్యాన్.. ఆ ఒక్క ‘ఆదిపురుష్’ డైలాగ్ వల్లే..

Adipurush Dialogue : ఇండియన్ సినిమాలు బ్యాన్.. ఆ ఒక్క ‘ఆదిపురుష్’ డైలాగ్ వల్లే..
Advertisement

Adipurush Dialogue : ఏ సినిమాలో అయినా ఒక చిన్న కాంట్రవర్సీ ఎలిమెంట్ అయినా ఉంటుంది. అలాంటిది అది ఒక పురాణానికి సంబంధించిన సినిమా అంటే అందులో ఎన్నో కాంట్రవర్సీలను వెతికిపట్టుకోవచ్చు. ‘ఆదిపురుష్’ విషయంలో కూడా అదే జరుగుతోంది. నేపాల్‌లో ఆదిపురుష్‌పై ఎక్కడాలేని కాంట్రవర్సీ ప్రారంభమయ్యింది. దీంతో అక్కడ పోఖార ప్రాంతంలో మొత్తంగా ఇండియన్ సినిమాలు బ్యాన్ అని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆదిపురుష్‌లోని ఒక డైలాగ్ వల్లే వారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఆదిపురుష్‌లోని ఒక డైలాగ్ నేపాల్ ప్రభుత్వాన్ని నిరాశపరిచింది. అందుకే ముందుగా నేపాల్ క్యాపిటల్ కాఠ్మండూలో ఈ సినిమా బ్యాన్ అవ్వగా ఇప్పుడు పోఖారాలో కూడా అదే జరిగింది. పోఖార ప్రభుత్వం తాజాగా ఆదిపురుష్ స్క్రీనింగ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆర్టర్ పాస్ చేసింది. పోఖారా మేయర్ బలేంద్ర షా.. ఈ విషయంపై చాలా సీరియస్‌గా స్పందించారు. ప్రస్తుతం అక్కడ థియేటర్లలో ఆదిపురుష్‌తో పాటు పలు ఇండియన్ సినిమాల స్క్రీనింగ్ జరుగుతుండగా.. వీటి ప్రాంతంలో హాలీవుడ్, నేపాల్ సినిమాలను స్క్రీన్ చేయడం మొదలుపెట్టారు.

‘ఇండియన్ సినిమా ఆదిపురుష్‌లో జానకీ భారతమాత బిడ్డ అని చెప్తూ ఒక డైలాగ్ ఉంది. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ చేసుకోవడానికే మేము మూడు రోజులు టైమ్ ఇచ్చాం. ఒకవేళ సినిమా అలాగే ప్రసారం అయితే.. నేపాల్ నేషనాలిటీ, కల్చర్ అనేది డ్యామేజ్ అవుతుంది’ అని కాఠ్మాండు మేయర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. దీంతో ఆ సినిమాను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement

కాఠ్మాండు మేయర్.. ఆదిపురుష్ మాత్రమే కాదు.. అన్ని ఇండియన్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ ఆపేయడం కోసం మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి లేఖ రాశారు. ఇక ఆదిపురుష్ టీమ్ తరపున.. టీ సిరీస్ కంపెనీ.. నేపాల్ మేయర్‌కు సమాధానం ఇచ్చింది. సినిమా అనేది కేవలం ఆర్ట్‌గా చూడాలని, అందులో డైలాగులు మతానికి, కల్చర్‌కు హాని కలిగిస్తాయి అనే విధంగా భావించకూడదని అర్ధించారు. అయినా కూడా నేపాల్ ప్రభుత్వం తన పంతాన్ని విడలేదు. మొత్తానికి ‘జానకీ భారతమాత బిడ్డ’ అనే డైలాగ్ మొత్తం నేపాల్‌నే.. ఇండియన్ సినిమాలకు వ్యతిరేకం చేసింది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×