BigTV English

Indian Racing League : హైదరాబాద్‌లో రేపటి నుంచే ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌

Indian Racing League : హైదరాబాద్‌లో రేపటి నుంచే ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌

Indian Racing League : హైదరాబాద్ మరో గ్రాండ్ ఈవెంట్ కు రెడీ అయింది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ మార్గంలో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు పటిష్టమైన ట్రాక్‌ను సిద్ధం చేశారు. పోటీల్లో పాల్గొనబోయే కార్లు కూడా సిటీకి వచ్చేశాయి. రేపు, ఎల్లుండి జరగబోయే పోటీల్లో… 2.8 కిలోమీటర్ల ట్రాక్ మీద 250 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్లనున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలు కావడంతో… నిపుణులు ఇప్పటికే ట్రాక్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. నెక్లెస్‌రోడ్డులోకి ఎవరూ ప్రవేశించకుండా చర్యలు తీసుకున్న పోలీసులు… ఆ రూట్లో తిరిగే వాహనాలను వివిధ మార్గాల్లోకి మళ్లించారు.


కార్ రేస్ చూసేందుకు వీలుగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక రోజు పోటీలు చూడాలంటే ఒక్కొక్కరికి రూ.749, రెండు రోజులు చూడాలంటే రూ. 1,249 చొప్పున టికెట్లను బుక్‌ మై షోలో అందుబాటులో ఉంచారు. అక్కడికి వెళ్లలేకపోయిన వాళ్లు స్టార్‌ స్పోర్ట్స్‌లో లైవ్ చూడొచ్చు. 2019లో తొలిసారి X1 రేసింగ్‌ లీగ్‌ పేరుతో పోటీలు నిర్వహించారు. ఇప్పుడు స్వల్ప మార్పులు చేసి ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌గా మార్చారు. లీగ్‌లో భాగంగా మొత్తం నాలుగు రేస్‌లు జరుగుతాయి. తొలి, చివరి రేస్‌లకు హైదరాబాద్‌ వేదిక కాగా, మధ్యలో రెండు రేస్‌లు చెన్నైలో జరుగుతాయి. నాలుగు రేస్‌లలో వచ్చిన ఫలితాలను బట్టి తుది విజేతను నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌ 10–11 తేదీల్లో చివరి రేస్‌ ఉంటుంది.

శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రేస్‌ జరుగుతుంది. తొలి రోజు రెండు క్వాలిఫయింగ్‌ రేసులతో పాటు ఒక ప్రధాన రేస్ జరుగుతుంది. ఆదివారం మరో రెండు ప్రధాన రేస్‌లు ఉంటాయి. ఒక్కో రేస్ గరిష్టంగా 40 నిమిషాలు ఉంటుంది. మొత్తం 22 కార్లు బరిలోకి దిగుతాయి. ఇటలీ కంపెనీ ‘వుల్ఫ్‌’ పేరుతో ఈ సింగిల్‌ డ్రైవర్‌ F3 డిజైన్‌ కార్లను తయారు చేసింది. మెన్, విమెన్ రేసింగ్‌లో తేడా రాకుండా… F3 కారు డిజైన్ ఉంటుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×