BigTV English

Iphone : కెమెరాలు ఐఫోన్ వే కానీ… ఆ సీక్రెట్ వెల్లడించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

Iphone : కెమెరాలు ఐఫోన్ వే కానీ… ఆ సీక్రెట్ వెల్లడించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్

Iphone : ఐఫోన్ క్రేజే వేరు. కానీ ధర విషయంలో అది అందరికీ అందుబాటులో ఉండదు. అయితే దానికి కెమెరా క్వాలిటీని మాత్రం ఏ స్మార్ట్ ఫోన్ కెమెరా కూడా అందుకోలేదు. అద్భుతమైన క్వాలిటీతో వస్తయి ఐఫోన్ తో తీసిన ఫొటోలు. అయితే దీనికి సంబంధించిన ఒక సీక్రెట్ ను వెల్లడించి అందరినీ నివ్వెర పరిచారు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. ఇంతకీ అదేంటంటే… కెమెరాలు ఐఫోన్ వే కానీ అందులో వాడే సెన్సర్లు మాత్రం యాపిల్ కంపెనీవి కావన్నారు. ఆ సెన్సర్లను సోనీ కంపెనీ తయారు చేస్తోందని, ఆ కంపెనీ నుంచే సెన్సార్లను కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.


సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులకు సోనీ కంపెనీ కెమెరాలను సరఫరా చేస్తుంది. ఐఫోన్ల కెమెరాల్లో వాడే సెన్సార్లను కూడా సోనీయే తయారు చేస్తోందని… అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ వెనుకున్న రహస్యం ఇదేనని టిమ్ కుక్ నిజాన్ని చెప్పేశారు.

టిమ్ కుక్ ప్రస్తుతం జపాన్ లో సరఫరాదారుల టూర్ లో చాలా బిజీగా ఉన్నారు. ఐఫోన్ కోసం అత్యున్నత ప్రపంచశ్రేణి కెమెరా సెన్సర్ల కోసం తాము దశాబ్దకాలంగా సోనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని టిమ్ కుక్ ట్వీట్ చేశారు. ఇక కుక్ ఇటీవల కుమమొటోలోని సోనో ఫెసిలిటీని సందర్శించారు. ఇఫోన్ మోడల్స్ లో వాడే హార్డ్ వేర్ గురించి యాపిల్ ఎన్నడూ పెద్దగా వివరాలు వెల్లడించలేదు. అలాంటిది ఇప్పుడు టిమ్ కుక్ అసలు నిజం వెల్లడించడంతో దీనికి కారణం ఏమై ఉంటుందనే చర్చ మొదలైంది.


యాపిల్ కెమెరాల కోసం సోనీ కంపెనీ తయారు చేసే హార్డ్ వేర్ వాడుతారంటూ గతంలో వార్తలు వచ్చాయి. కానీ దాన్ని యాపిల్ కంపెనీగానీ, సోనీ కంపెనీగానీ నిర్ధారించలేదు… అలాగని కొట్టిపారేయలేదు. అలాంటిది ఇప్పుడు టిమ్ కుక్ ప్రకటనతో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. అంతేకాదు ఇకముందు కూడా తమ భాగస్వామ్యం కొనసాగుతుందని సోనీ ఫెసిలిటీని సందర్శించిన సమయంలో కుక్ తెలపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో రాబోయే ఐఫోన్ మోడల్స్ లోనూ సోనీ సెన్సార్లను వాడనున్నారని తెలుస్తోంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×