Nicholas Pooran : సాధారణంగా కొంత మంది మల్టీపుల్ టాలెంటేడ్ క్రీడాకారులు ఉంటారు. ముఖ్యంగా క్రికెట్ ఆటగాళ్లు తమ టాలెంట్ ను చూపిస్తుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. స్టేడియంలో బ్యాట్, బాల్ తో మెరుపులు మెరిపించే క్రికెటర్లు అప్పుడప్పుడూ తమలో దాగి ఉన్న ఇతర టాలెంట్ ని బయటపెడుతుంటారు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూర్ కూడా తనలో ఉన్న గాయకుడిని అభిమానులకు పరిచయం చేశాడు.
లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్.. టీమ్ లోని ఇతర సభ్యులతో కలిసి హిందీ పాట పాడి అలరించాడు. సరదాగా ఆయన పాట పాడిన వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అది ప్రస్తుతం వైరల్ గా మారింది. మరోవైపు ఈ ఐపీఎల్ లో నికోలస్ పూరన్ చాలా నిలకడగా ఆడుతూ అత్యధిక పరుగులు చేశాడు. ఇప్పటి వరకు నికోలస్ పూరన్ 288 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అలాగే నూర్ అహ్మద్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలివడం విశేషం.
ఇక లక్నో జట్టు నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి వరకు మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ వైపు ఉన్న సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఉన్నట్టుండి నడుం నొప్పి అంటూ మైదానంలో ట్రీమ్ మెంట్ తీసుకున్నాడు. దీంతో కొద్ది సేపు బ్రేక్ వచ్చింది. శార్దూర్ వైడ్లతో ప్రారంభించి.. చివరి బంతికి రెహానె ను ఔట్ చేశాడు. చివరిలో రింకుసింగ్, హర్షిత్ పోరాడినా కోల్ కతా ఓటమి నుంచి తప్పించుకోలేదు. అయితే లక్నో జట్టు కెప్టెన్ పంత్ నడుం నొప్పి కారణంగానే అలా జరిగిందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్ 5 మ్యాచ్ లు ఆడగా.. 3 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. పాయింట్స్ టేబుల్ పట్టికలో లక్నో జట్టు 5 వ స్థానంలో కొనసాగుతోంది. లక్నో కంటే ముందుగా పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, గుజరాత్, ఢిల్లి క్యాపిటల్స్ ఉన్నాయి. తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో కొనసాగుతుండటం విశేషం. లక్నో జట్టు తరువాత తన మ్యాచ్ ను గుజరాత్ టైటాన్స్ తో ఏప్రిల్ 12న శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఆడనుంది. ప్రతీ శనివారం, ఆదివారం రెండు మ్యాచ్ లు ఉండనున్నాయి. మొన్న ఆదివారం శ్రీరామనవమి కావడంతో కోల్ కతాలో జరగాల్సిన మ్యాచ్ మంగళవారానికి వాయిదా పడింది. దీంతో మంగళవారం రోజు జరిగింది. ఈ మ్యాచ్ లో నికోలస్ పూరన్ 36 బంతుల్లోనే అజెయంగా 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మార్క్రమ్ కూడా 47 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 81 పరుగులతో చెలరేగాడు. దీంతో లక్నో జట్టు 238 భారీ స్కోర్ సాధించింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">