BigTV English

Instagram love story: ఆంధ్ర అబ్బాయి కోసం ఇండియా వచ్చేసిన అమెరికా అమ్మాయి.. వీరి ఇన్‌స్టా స్టోరీ భలే ఉందే!

Instagram love story: ఆంధ్ర అబ్బాయి కోసం ఇండియా వచ్చేసిన అమెరికా అమ్మాయి.. వీరి ఇన్‌స్టా స్టోరీ భలే ఉందే!

ఇన్ స్టా లవ్ స్టోరీలన్నీ ఇన్ స్టంట్ లవ్ స్టోరీలని అనుకుంటాం. అయితే వాటిలో కొన్ని పెళ్లి పీటల వరకు వెళ్తుంటాయి. అలాంటి వాటిలో ఈ ఖండాంతర లవ్ స్టోరీ ఒకటి. ఆమెది అమెరికా, అబ్బాయిది ఆంధ్రా. వీరిద్దరూ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయికంటే ఆమె 9 ఏళ్లు పెద్దది. అయినా కూడా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో వారిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణాన్ని ఓ అందమైన దృశ్యకావ్యంగా మార్చి సోషల్ మీడియాలో పంచుకున్నారు.


?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
అలా మొదలైంది..
అమెరికాకు చెందిన జాక్లిన్ ఫొరెరో.. ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ఎంతో చలాకీగా ఉంటుంది, జీసస్ ని ఆరాధిస్తుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం గందరగోళంగా మారింది. 2021లో జరిగిన వైల్డ్ ఫైర్ లో అంతా పోగొట్టుకుంది. కుటుంబ కలహాలతో జీవిత భాగస్వామికి కూడా దూరమైంది. చివరకు ఒంటరిగా మిగిలింది. ఆ ఒంటరి జీవితం నుంచి బయటపడేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. దైవ భక్తిలో ఎక్కువ సమయం గడిపేది. చివరకు ఇన్ స్టా లో ఒక ప్రొఫైల్ ఆమెను ఎంతో ఆకర్షించింది. ఆ అబ్బాయి పేరు చందన్. చందన్ సింగ్ రాజ్ పుత్ అనే పేరుతో ఇన్ స్టా అకౌంట్ ఉంది. మ్యూజిక్ అంటే ఇష్టం. ఫొటోగ్రఫీ అంటే పిచ్చి. వీరిద్దరిలో రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఫొటోగ్రఫీ, రెండోది జీసస్. ఆ అబ్బాయికి కూడా దైవభక్తి ఎక్కువ. ఆ పాయింటే ఆమె తల్లికి కూడా నచ్చింది. తల్లి అనుమతితో తన ఇష్టాన్ని చందన్ కి తెలియజేసింది ఫొరెరో.

రాకపోకలు..
అమెరికా నుంచి ఫొరెరో తన తల్లితో సహా ఆంధ్రాకు వచ్చింది. చందన్ ఇంట్లోనే కొన్నిరోజులు ఉన్నది. ఆ టైమ్ లోనే ఇరు కుటుంబాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఇద్దరి పెళ్లికి నిశ్చయించాయి. పెళ్లైన తర్వాత వారిద్దరూ అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. దానికోసం ఇప్పట్నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తమ లవ్ స్టోరీని సింపుల్ అండ్ షార్ట్ వీడియో రూపంలో ఇన్ స్టాలో పంచుకున్నారు వీరిద్దరూ. అంతే కాదు జాకీ అండ్ చందన్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. అందులో తమ సుదీర్ఘ లవ్ స్టోరీని పోస్ట్ చేశారు.


ఇన్ స్టా లో ముందు చందన్ ఆమెకు హాయ్ చెప్పారు. అలా హాయ్ తో మొదలైన వారి పరిచయం 14 నెలల్లో ఐ లవ్ యూ అని చెప్పుకునే వరకు వచ్చింది. ఈ 14 నెలలు తమకు తెలియకుండానే గడచిపోయాయని చెబుతున్నారిద్దరూ. చివరకు ఫొరెరో భారత్ కి రావడంతో ఆ ప్రేమ కథ సుఖాంతమైంది. ప్రేమించిన వ్యక్తి కోసం తల్లిని ఒప్పించడమే కాకుండా వేల మైళ్లు ప్రయాణం చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. ఈ ప్రేమ జంట తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రదేశాలు తిరిగి వచ్చారు. తల్లిదండ్రులు కూడా పర్మిషన్ ఇవ్వడంతో వీరి ప్రేమ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. అయితే అతనికంటే ఆమె 9 ఏళ్లు పెద్దది కావడం ఇక్కడ ట్విస్ట్. అయితే అదేమంత ఇబ్బంది కాదని, వారిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×