Indian Railways: హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నిర్మించింది భారతీయ రైల్వే సంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూ. 413 కోట్లలో తీర్చిదిద్దింది. జనవరి 6న ప్రధాని నరేంద్రం మోడీ ఈ రైల్వే స్టేషన్ ను పరారంభించారు. హైదరాబాద్ లోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలోని రద్దీని తగ్గించడంలో సాయపడేందుకు దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ రైల్వే స్టేషన్ కు సిటీ నుంచి తగినంత కనెక్టివిటీ లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సు కనెక్టివిటీని అందించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చర్లపల్లికి చేరుకోవడం ఓ సవాలుగా మారింది.
సిటీలోని పలు ప్రాంతాల నుంచి 146 బస్సు సర్వీసులు
తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతం సిటీలోని పలు ప్రాంతాల నుంచి చర్లపల్లి టెర్మినల్ కు ప్రతిరోజూ దాదాపు 146 బస్సు సర్వీసులను నడుపుతున్నది. చెంగిచెర్ల డిపోకు చెందిన బస్సులు సికింద్రాబాద్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒకటి (250C) చొప్పున నడిపిస్తున్నారు. ఇవి హబ్సిగూడ, నాచారం, తార్నాక, మల్లాపూర్ లాంటి ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. మొదటి బస్సు చర్లపల్లి నుంచి ఉదయం 4:20 గంటలకు బయల్దేరగా, చివరి బస్సు రాత్రి 10:05 గంటలకు బయలుదేరుతుంది. ఇక రైల్వే స్టేషన్ సౌత్ వైపు ఉప్పల్, రామంతపూర్, నారాయణగూడ, పంజాగుట్ట మీదుగా బోరబండకు 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో 12 బస్సు సర్వీసులు (113F/Z) నడుస్తున్నాయి. అయినప్పటికీ సమీపంలో మెట్రో కనెక్టివిటీ లేకపోవడం ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్ కు సుమారు 10 కిలో మీటర్ల దూరంలో మెట్రో స్టేషన్లు(హబ్సిగూడ, NGRI, తార్నాక, ఉప్పల్) ఉన్నాయి. దీనివల్ల ప్రయాణీకులు క్యాబ్ లు లేదంటే ఇతర రవాణా సౌకర్యాల మీద ఆధారపడాల్సి వస్తోంది.
MMTS సేవలు సరిగా లేకపోవడం
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి డిమాండ్ కు తగినంతగా మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) సేవలు లేకపోవడంతో ప్రయాణీకులకు సవాలుగా మారింది ప్రస్తుతం, లింగంపల్లికి (ఉదయం 7:42, సాయంత్రం 7:57 గంటలకు) రెండు MMTS రైళ్లు నడుస్తున్నాయి. ఘట్కేసర్‌కు (రాత్రి 7:14, రాత్రి 10:09 గంటలకు) రెండు రైళ్లు నడుస్తున్నాయి. కానీ, ప్రయాణీకులకు ఇవి ఏమాత్రం సరిపోవడం లేదు.
Read Also: సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దేశంతో చూడాల్సిన బెస్ట్ 5 ప్లేసెస్ ఇవే!
కనెక్టివిటీ పెంచాలని కోరుతున్న ప్రయాణీకులు
జూన్ 15 నుంచి హైదరాబాద్‌కు బదులుగా చర్లపల్లి నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ నుంచి నడిచే 13 రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించబోతున్నారు. ఈ మార్పులలో ఏప్రిల్ చివరి నాటికి అమలులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో టెర్మినల్‌ను ఉపయోగించుకునే ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరగనుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని MMTS, బస్సు ఫ్రీక్వెన్సీని పెంచాలని కోరుతున్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచే దిశగా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Also: ఏంటీ.. ఈ రైల్వే స్టేషన్ నుంచి రోజుకు 600 రైళ్లు రాకపోకలు చేస్తాయా?