Big Stories

Karthika Masam : కార్తీక మాసంలోనే సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించాలా

Karthika Masam : తెలుగు మాసాల్లో మహిమాన్వితమైన మాసం కార్తీకం. ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుంది. పరమశివుడికి ప్రియమైన మాసం. సృష్టి ఆరంభం జరిగిందీ త్రేతాయుగం మొదలైందీ ఈ నెలలోనే.. దేవాలయంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ, సముద్రతీరాన కానీ, నదీతీరాన కానీ, స్వగ్రహమునకానీ, పుణ్యక్షేత్రములందు సత్యనారాయణ వ్రతం చేయాలి. బ్రాహ్మణులను , బంధుమిత్రుల సమక్షంలో ఏదైనా శుభ దినాన సాయంకాలం కానీ, ఉదయం కానీ వ్రతాలు ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

- Advertisement -

త్రిమూర్తి స్వరూపమైన సత్యనారాయణ స్వామి రామావతారంలో తన భక్తుడైన రత్నాకరుడకి ఇచ్చిన మాట కోసమే అన్నవరంలోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.
భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

- Advertisement -

సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల పొందవచ్చని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరాల్సిందే.

వత్రం వాయిదా వేయడం వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది
సత్యనారాయణ స్వామి వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో…నియమ నిష్టలతో ఈ వ్రతం చేసిన వారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సమస్త దోషాల నుంచి సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News