E-Paper
Advertisement

KCR: కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఏకంగా?

KCR: కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఏకంగా?
Advertisement

KCR: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. మరింత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. ఈ నెల 5న బదులు.. 11వ తారీఖుున కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అవుతానని కేసీఆర్ తెలిపారు.

ఇటీవల మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఆయనకు ఈ నోటీసులు ఇచ్చింది. జూన్‌ 5 లోపు కమిషన్ ఎదుట హాజరు కావాలని పేర్కొంది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు కమిషన్ నుంచి నోటీసులు వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో అవకతవకలపై విచారణ జరుపుతోంది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. గతేడాది మార్చి 13న రేవంత్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఏర్పాటు చేసిన ఇప్పటికి 14 నెలలు పూర్తి కావచ్చింది. ఏడుసార్లు కమిషన్ గడువు పొడిగించింది ప్రభుత్వం. ఇప్పటివరకు 109 మంది ఆఫీసర్లు, వ్యక్తుల స్టేట్మెంట్ రికార్డు చేసింది.

Advertisement

ప్రభుత్వం ఉద్యోగులంతా పైస్థాయి అధికారులు చెప్పినట్టే చేశామని కమిషన్ ముందు ప్రస్తావించారు. వారి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆనాటి బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం పెద్దలు కేసీఆర్, హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌కు మే 20వ తారీఖున నోటీసులు ఇచ్చింది. జూన్ ఐదులోగా విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించింది. కేసీఆర్ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు హరీశ్ రావు. అప్పుడు ఆర్థిక‌శాఖ మంత్రిగా ఈటెల ఉన్నారు. బీఆర్ఎస్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఈ ముగ్గురు కీలకపాత్ర పోషించారని అభిప్రాయం పడింది. ఈ క్రమంలోనే వీరి ముగ్గురికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, కుంగిపోవడం, లీకేజీలు వాటిపై కమిషన్ విచారణ చేపట్టింది. దీని నిర్మాణానికి భారీగా నిధులు ఖర్చు చేసింది అప్పటి ప్రభుత్వం. రెండేళ్ల కిందట సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజీలో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మిగతా బ్యారేజీల్లో సమస్యలు తలెత్తాయి. ఈ వ్యవహారం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సమగ్ర విచారణకు ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించిన విషయం తెల్సిందే. ప్రాజెక్ట్ ప్లాన్, డిజైన్, ఖర్చు, అమలు వంటి అంశాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

ఈ క్రమంలో విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఈ కమిషన్ గడువు మే 31 నాటితో ముగియనుంది. ఇప్పటి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించినవారిని విచారించకుండా నివేదిక ఇవ్వడం కరెక్టు కాదని కమిషన్ అభిప్రాయం పడింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కమిషన్ గడువు ఏడోసారి పెంచింది. జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. ఈలోగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలను విచారించనుంది. వారిచ్చిన స్టేట్‌మెంట్‌ను నివేదికలో పొందుపర్చనుంది. ఆ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత అప్పుడు వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది.

అయితే, ఈ క్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. మరింత సమయం కావాలని కమిషన్ ను కేసీఆర్ కోరారు. ఈ నెల 5న బదులు.. 11వ తారీఖుున కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు అవుతానని కేసీఆర్ తెలిపారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×