BigTV English

Corona: 3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్‌ డేంజర్ భయ్యా

Corona: 3900 కరోనా కేసులు, ఇప్పటివరకు 32మంది మృతి.. ఈ కొవిడ్‌ డేంజర్ భయ్యా

Corona: దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 3900 కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్ లలో కేసులు భారీగా నమోదు అవుతున్నట్టు చెప్పారు. కేరళ, కర్నాటకలో కొవిడ్ సోకి తాజాగా ఇద్దరు మృతిచెందినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కొవిడ్ మృతుల సంఖ్య 32కి చేరింది. దేశంలో ఇప్పటి వరకు 2188 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్టు అధికారులు వివరించారు.


ALSO READ: Navodaya Notification: పిల్లల బంగారు భవిష్యత్తు కోసం హైక్వాలిటీ స్టడీ.. అంతా ఫ్రీ, డోంట్ మిస్

కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని.. కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 360 ఇన్ఫెక్షన్లు నమోద అయ్యాయని చెప్పారు. దేశంలో పెరుగుతున్న కొవిడ్ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఇతర వేరియంట్లతో కంపేర్ చేస్తే.. ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న సూచనలు కనబడడం లేదని వివరించింది. ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్ లక్షణాలను, దాని ప్రభావాన్ని ఈజీగా కట్టడి చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావించింది.


ALSO READ: Corona virus: కలవరపెడుతున్న కరోనా కేసులు.. ఏపీ, తెలంగాణలో టెన్షన్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3961 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కేరళ రాష్ట్రంలోనే అత్యధికంగా 1435 కేసులు నమోదు అయినట్టు అధికారులు పేర్కొన్నారు. మహారాష్ట్రంలో 506 యాక్టివ్ కేసులు ఉండగా.. ఏడుగురు మృతిచెందారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో 483, వెస్ట్ బెంగాల్‌లో 339, గుజరాత్ రాష్ట్రంలో 338 కేసులు, తమిళనాడులో 199 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 149, ఒడిశాలో 12, పంజాబ్ లో 6 కేసులు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×