Hyper Aadi: బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి పరిచయమై మంచి సక్సెస్ అందుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగిన ఈయన అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు అందుకుంటూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా హైపర్ ఆది ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఢీ డాన్స్ షో కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi Drama Company) కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.
స్కూల్ టాపర్…
ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా కమెడియన్స్ మార్కుల జాబితాలను ప్రదర్శించారు. అయితే కమెడియన్ హైపర్ ఆది మార్క్స్ లిస్ట్ (Marks List)చూస్తే మాత్రం దిమ్మతిరిగి పోవాల్సిందే. కామెడీ చేయటంలోనూ, ఇతరులపై పంచ్ వేయటంలో మాత్రమే కాదు చదువులో కూడా హైపర్ ఆది తోపు అని స్పష్టం అవుతుంది. హైపర్ ఆది పదవ తరగతికి సంబంధించిన మార్కుల జాబితాను ప్రదర్శించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొత్తం 60 మార్కులకు గాను ఈయనకు పదో తరగతిలో 534 మార్కులు వచ్చాయని తెలుస్తుంది.
చదువులో ఇంత టాలెంట్ ఉందా…
ఇక తన మార్కుల గురించి ఆది మాట్లాడుతూ తాను ఏడో తరగతిలో కూడా స్కూల్ టాపర్ అని తెలిపారు. ఇప్పటికి నేను చదివిన స్కూల్ కి వెళ్తే అక్కడ టాపర్స్ లిస్టులో కోటా ఆదయ్య అని నా పేరు ఉంటుంది. ఇప్పుడు అందరికీ నేను హైపర్ ఆదిగా పరిచయమైన తన పూర్తి పేరు అదేనని తెలిపారు. ఇక పదో తరగతిలో నేను స్కూల్ సెకండ్ అని ఆది తెలియజేశారు. ఇక ఇంటర్, బీటెక్ లో కూడా నాకు చాలా మంచి మార్కులే వచ్చాయని తెలిపారు. ఇక ఇంటర్ మార్క్ లిస్ట్ విషయానికి వస్తే 1000 కిగాను హైపర్ ఆదికి ఏకంగా 945 మార్కులు వచ్చినట్టు తెలుస్తుంది. ఇంటర్లో మాథ్స్ లో హైపర్ ఆది ఏకంగా 75 కి 75 మార్కులు తెచ్చుకోవటం విశేషం. అయితే టెన్త్, ఇంటర్, బి టెక్ లో నాకు ఒక ఇంగ్లీషులో మాత్రమే మార్కులు తగ్గాయని హైపర్ ఆది తెలిపారు.
ఇలా హైపర్ ఆది చదువులో పస్ట్ ర్యాంకర్ అని ఈ మార్క్స్ కార్డ్ ద్వారా స్పష్టం కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతూ తమదైన శైలిలోనే స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక హైపర్ ఆది బిటెక్ పూర్తి చేసిన తర్వాత ఆ రంగంలో ఉద్యోగం చేయడం నచ్చక సినీ ఇండస్ట్రీ వైపు వచ్చినట్టు పలు సందర్భాలలో తెలిపారు. అయితే తన చదువుల కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని తమకు ఉన్న పొలం కూడా అమ్మేసి మమ్మల్ని చదివించారని ఆది గతంలో తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న తర్వాత నాన్నకు పొలం కొనిచ్చిన విషయం కూడా అందరికి తెలిసినదే. ఇక కెరియర్ పరంగా ఆది వరుస సినిమాలలో అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.