
Keto Diet : మారిన ఆహారపు అలవాట్ల వల్ల ఊబకాయులు విపరీతంగా బరువు పెరిగి అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. బరువు తగ్గేందుకు వ్యాయామాలతో పాటు ఈ కీటో డైట్‌ను కూడా ఫాలో అవ్వండి. దీనిలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ ఉంటాయి. దీంతో మన శరీరం గ్లూకోజ్‌ను కాకుండా కొవ్వును ఇంధనంగా వాడుకుంటుంది. మరి కీటో డైట్‌లో తీసుకోవాల్సిన ఆహారాలేవో చూద్దామా?
జుచిని
కీరదోసను పోలి ఉండే కూరగాయ జుచిని. దీనిని సలాడ్స్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. విటమిన్స్, కాల్షియం ఉంటాయి. బరువు తగ్గడానికి ఈ జుచిని ఉపయోగపడుతుంది.
గుమ్మడి
గుమ్మడి కాయలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ముక్కలను సలాడ్స్ లేదా కూరగా చేసి తినవచ్చు.
ఆస్పరాగస్
ఆస్పరాగస్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. దీనిని సూప్స్ లేదా ఫ్రైగా చేసుకుని తినవచ్చు. దీంతో బరువు తగ్గడం సులభం.