BigTV English

Key Tests:చంద్రయాన్ 3 అప్డేట్.. టెస్టులు పూర్తి..

Key Tests:చంద్రయాన్ 3 అప్డేట్.. టెస్టులు పూర్తి..

Key Tests:చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి ఇప్పటికీ ఎన్నో దేశాలు పోటీపడుతున్నాయి. ఇతర దేశాల సాయం లేకుండా తమ దేశజెండాను చంద్రుడిపై ఎగరవేయాలని ప్రతీ దేశ శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అందుకే ఈ విభాగంలో పరిశోధనలు వేగవంతం అయ్యాయి. వారితో పోటీపడడానికి ఇండియా కూడా బరిలోకి దిగనుంది. చంద్రయాన్ 3 తయారీని భారత్ శాస్త్రవేత్తలు వేగవంతం చేశారు.


చంద్రయాన్ 3ను ఈ ఏడాది ఎలాగైనా చంద్రుడిపై ల్యాండ్ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ దీని తయారీని వేగవంతం చేశారు భారత్ శాస్త్రవేత్తలు. తాజాగా చంద్రయాన్ 3.. ఈఎమ్ఐ (ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇంటర్‌ఫియరెన్స్), ఈఎమ్‌సీ (ఎలక్ట్రో మ్యాగ్నటిక్ కంపాటబిలిటీ) టెస్టులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) స్వయంగా బయటపెట్టింది.

బెంగుళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో చంద్రయాన్ 3 ఈఎమ్ఐ/ఈఎమ్‌సీ టెస్టులను పూర్తిచేసుకుందని ఇస్రో తెలిపింది. స్పేస్ వాతావరణంలో శాటిలైట్ మిషిన్స్ ఎలా పనిచేస్తాయి. ఎలక్ట్రో మ్యాగ్నిటిక్ లెవెల్స్‌తో ఇవి ఇమిడి ఉంటాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ టెస్టులు నిర్వహిస్తారు. అంతరిక్షంలోకి వెళ్లే ప్రతీ శాటిలైట్‌కు ఈ టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ పాస్ అయితే శాటిలైట్లు స్పేస్‌లో ఎగరడానికి సిద్ధమని అర్థం.


చంద్రయాన్ 3 మిషిన్‌లో మూడు వేర్వేరు మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మూడు మాడ్యూల్స్ మధ్య కమ్యూనికేషన్‌కు ఏర్పారచడమే కష్టమైన విషయమని ఇస్రో తెలిపింది. అయితే ఈ టెస్టుల సమయంలో చంద్రయాన్ 3 పర్ఫార్మెన్స్ భాగానే ఉందని ఇస్రో సంతోషం వ్యక్తం చేసింది. త్వరలోనే చంద్రయాన్ 3 గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తామని వారు అన్నారు. ఈ మిషిన్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

New Cell Technology:ట్యూమర్లను కనిపెట్టే సెల్ టెక్నాలజీ..

People and Government:ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలు.. ప్రైవసీ విషయంలో..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×