BigTV English

Mahanandi:మహానందికి వెళ్లే ముందు ఈవిషయం తెలుసుకోండి

Mahanandi:మహానందికి వెళ్లే ముందు ఈవిషయం తెలుసుకోండి

Mahanandi:మహానందిలోను డ్రెస్ కోడ్ మొదలైంది. ఇక నుంచి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వారిని మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. మహిళా భక్తులు చీర లేదా చున్నీ ఉన్న చుడీదార్‌ ధరించి దర్శనాలకు రావాలన్న నిబంధనలు అమలు చేస్తున్నారు. అలాగే పురుషులు పంచె లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
ఆలయ గర్భ గుడిలోకి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తుల విధానాన్ని తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. అంతేకాదు భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించే విధంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఛైర్మన్‌ అండ్ ఈవో. ఆలయ ధర్మకర్తల మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు గౌరవించాలని కోరారు.అయితే ఇప్పటికే ఈ సంప్రదాయ దుస్తుల డ్రెస్ కోడ్ విధానం తిరుపతిలో అమల్లో ఉంది.


దైవ సందర్శన సందర్బంలో పురుషులు, స్త్రీలు సంప్రదాయమైన దుస్తులను ధరించే ఉండాలని ధర్మశాస్త్రం చెబుతోంది. మహిళలు ఒంటికి వస్త్రాలు నిండుగా కట్టుకుని దేవుడి ఆరాధనలో పాల్లొనాలని చెబుతోంది. పురుషులు నడుము పైభాగాన వస్త్రాన్ని ధరించకుండా ఆలయంలోని విగ్రహం దగ్గరకి వెళ్లి ఆ స్వామి కృప కలగాలని ప్రార్ధిస్తారు. ఈ విధానం ఫలితంగా వాళ్ల మనసు పవిత్రమై ప్రశాంతత కలుగుతుంది. దేవుడు తమకి తోడుగా ఉన్నాడనే మానసిక భావన వాళ్లకి ఎంతో శక్తిని కలిగిస్తుంది.అలాగే పురుషులు దేవుడి విగ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆ విగ్రహంలోని వివిధ భాగాల నుంచి వెలువడే కొన్ని శక్తి కిరణాలు వాళ్ల శరీరంలో ప్రవేశించటం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సంప్రదాయ బద్ధమైన వస్త్రాలతో దైవదర్శనం చేయడం వల్ల ఎలాంటి ఆకర్షణలకు లోనయ్యే పరిస్థితి ఉండదు.ఉత్తరాదిలో కూడా ఇదే రకమైన ఆచార పద్ధతులు పాటిస్తున్నారు. వారణాసి లాంటి చోట్ల దోతి -కుర్తా ధరించిన వారిని మాత్రమే ఆలయ గర్భగుడిలోకి అనుమతిస్తుటారు. మిగిలిన వారు దూరంగా ఉండి స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నో అద్భుతాలు ఉన్న ఆలయాల్లో మహానంది ఒకటి. ఇక్కడ కోనేరు ఏడాదంతా నీరు పారుతూ ఉండటం వింత. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. కాలానుగుణంగా నీరు ఉండటం దేవుడి మహత్యమేనని బలంగా నమ్ముతుంటారు. మ హానంది పుణ్యక్షేత్రంలో స్వామి వారు పుట్టాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు .


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×