BigTV English

Mekapati : మీరే నా తండ్రి.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం..మేకపాటికి ఆ యవకుడు సవాల్..

Mekapati : మీరే నా తండ్రి.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం..మేకపాటికి ఆ యవకుడు సవాల్..

Mekapati : నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చుట్టూ వారసుడు వివాదం రాజుకుంది. తనను కుమారుడిగా అంగీకరించాలని ఎమ్మెల్యేకు శివచరణ్ రెడ్డి అనే యువకుడు బహిరంగ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ యువకుడి విడుదల చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది. తల్లి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో ఆ యువకుడు చిన్నతనంలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఇదీ కథ
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తన తండ్రని శివచరణ్‌ రెడ్డి బహిరంగ లేఖలో పేర్కొన్నాడు. పద్దెనిమిదేళ్లు తన తల్లితో కాపురం చేసి వదిలిపెట్టారని ఆరోపించాడు. వారిని రహస్యంగా ఉంచారని వివరించాడు. ఎప్పుడూ బయటకు రావద్దని కోరారని అందుకే ఇన్నాళ్లూ ఆయనను ఇబ్బంది పెట్టలేదని పేర్కొన్నాడు. సంపద, రాజకీయ వారసత్వం తనకు అక్కర్లేదని ఆ యువకుడు స్పష్టం చేశాడు. తండ్రిగా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మిస్సయ్యానని లేఖ వివరించాడు.

ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు కుమారులు లేరని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పడం తనను బాధించిందని శివచరణ్ రెడ్డి అన్నాడు. అందుకే ఇప్పుడు బయటికొచ్చానని స్పష్టం చేశాడు.
తనను కొడుకుగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. తాను 8వ తరగతిలో ఉన్నప్పుడు మమ్మల్ని పూర్తిగా వదిలేశారని ఆరోపించాడు. ఆయనతో తాను, తల్లి కలిసి దిగిన చిత్రాలను బయటపెట్టానని… కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధమన్నాడు.


శివచరణ్ రెడ్డి లేఖపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్పందించి ఓ వీడియో విడుదల చేశారు. శివచరణ్‌రెడ్డి తల్లి భర్త పేరు వెంకట కొండారెడ్డి అని తెలిపారు. డబ్బుల కోసం తనను బ్లాక్‌మెయిల్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కొందరు ఈ విషయాన్ని వాడుకొంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తనకు రెండో భార్య ఉందని, ఆమె పేరు శాంతమ్మ అని ప్రకటించారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి చంద్రశేఖర్‌రెడ్డి తరఫున శాంతమ్మ ప్రజల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ కార్యకలాపాలను ఆమే చూసుకొంటున్నారు. ఇదే విషయంలో ఆయన మొదటి భార్య తులసమ్మ, కుమార్తె రచనారెడ్డి, మేకపాటి కుటుంబ సభ్యులు.. చంద్రశేఖర్‌రెడ్డితో విభేదించి దూరంగా ఉన్నారని ప్రచారం ఉంది. 29 ఏళ్లుగా శాంతమ్మకు తనకు మధ్య బంధం ఉందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనకు శాంతమ్మకు కలిగిన సంతానం సాయిప్రేమికారెడ్డి అని వెల్లడించారు. తనకు ఇద్దరు అమ్మాయిలేనని మగ సంతానం లేదని మరోసారి స్పష్టంచేశారు. ఆ పాత ఫోటోలపై ఆయన సమాధానం చెప్పలేదు. డీఎన్ఏ పరీక్షపైనా స్పందించలేదు. మరి ఆ యువకుడు వారసుడేనా..? లేక రాజకీయ ప్రేరేపిత ఆరోపణలా? చూడాలి ఏం జరుగుతుందో.?

Tags

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×