Big Stories

Rahul Gandhi : ఉత్తరాధిలో కాంగ్రెస్ కు ఆదరణ.. ఆ రాష్ట్రాల్లో అధికారం ఖాయం: రాహుల్ గాంధీ

Rahul Gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. పార్టీపై విశ్వాసం ప్రజల్లో రోజురోజుకు పెరుగుతోంది. రాహుల్ పేద ప్రజలతో మమేకమవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. వివిధ రంగాల ప్రముఖులు భారత్ జోడో యాత్రలో పాల్గొని కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం హర్యానాలో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ పార్టీ భవిష్యత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

హిందీ మాట్లాడే ఉత్తరాధి రాష్ట్రాల్లో ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు హిందీ రాష్ట్రాల్లో విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. కేరళలో భారత్ జోడో యాత్ర సాగినప్పుడు విశేష స్పందన వచ్చిందన్నారు. కానీ బీజేపీ పాలిత కర్ణాటకలో ఆదరణ ఉండదని చాలామంది అన్నారని.. కానీ కన్నడ నాట ఇంకా ఎక్కువ మంది యాత్రకు తరలివచ్చారని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగుపెట్టినప్పుడు అక్కడ యాత్ర ఫెయిల్ అవుతుందనే కామెంట్లు వినిపించాయని అయితే.. జనం ఇంకా బాగా ఆదరించారని గుర్తుచేశారు.

- Advertisement -

బీజేపీ అధికారంలో ఉన్న హిందీ మాట్లాడే ఉత్తరాధి రాష్ట్రాల్లో యాత్రను ఆదరించరని విమర్శలు వ్యక్తమయ్యాయని రాహుల్ గాంధీ అన్నారు. కానీ దక్షిణాధి కంటే ఎక్కువ ఆదరణ ఇక్కడే లభిస్తోందని వివరించారు. ఈసారి కచ్చితంగా ఉత్తరాధి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రజలు భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.

బీజేపీకి మరోసారి రాహుల్ గాంధీ చురకలు అంటించారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను మాత్రం అసలు బీజేపీని పట్టించుకోనని స్పష్టం చేశారు. మన పని మనం చేసుకుంటే పోతే ఫలితం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భగవత్‍ గీత శ్లోకాన్ని గుర్తు చేశారు. మొత్తంమీద రాహుల్ గాంధీ కన్యాకుమారిలో ఏ జోష్ తో భారత్ జోడో యాత్ర ప్రారంభించారో ఇప్పుడు అదే హుషారుతో ముందుకుసాగుతున్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే ప్రజల నుంచే అదేస్థాయిలో ఆదరణ లభిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News