Big Stories

RevanthReddy: ORRలోకి కేటీఆర్ బినామీ సంస్థలు!.. 2వేల ఎకరాలపై కన్ను!.. రేవంత్ సంచలన ఆరోపణలు..

- Advertisement -

RevanthReddy: సీఎం కేసీఆర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు ఆదాయాన్ని 30 ఏళ్లకు తనఖా పెట్టి 48 గంటల్లో 15వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్ ఇప్పిస్తానన్నారు. ఈ స్విస్ ఛాలెంజ్‌కు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. వేల కోట్ల స్కాం జరిగిందని నిర్దిష్టమైన ఆరోపణలు చేస్తుంటే.. ఎందుకు స్పందించడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్, HMDA కమిషనర్‌కు ప్రశ్నలు సంధించారు.

- Advertisement -

70 కోట్ల విలువగల ORRను 7380 కోట్లకు, 30 ఏళ్ల పాటు ఎలా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్న కేసీఆర్.. తెలంగాణలో ORRను ఎట్లా ప్రైవేట్ పరం చేస్తారని నిలదీశారు రేవంత్‌రెడ్డి.

కేంద్ర హై వే అథారిటీ నిబంధనలకు వ్యతిరేకంగా ORR లీజ్ ఉందని.. 30 ఏళ్ల పాటు లీజ్‌కు ఇవ్వడం రూల్స్‌కు విరుద్ధమని అన్నారు. 15 ఏళ్ల కంటే ఎక్కువ లీజ్ ఇవ్వకూడదని హైవే అథారిటీ చెబుతోందన్నారు.

బేస్ ప్రైజ్ నిర్ణయించుకుండా టెండర్ పిలుస్తారా? అని మండిపడ్డారు. టెండర్ పిలువక ముందు ORR.. hmda పరిధిలో ఉండేదని.. అలాంటిది హడావుడిగా ORRను GHMCకి ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ORR కింద రెండు వేల ఎకరాల భూమి ఉందని.. కేటీఆర్ బినామీ సంస్థలు ORRలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రోజుకు రెండు కోట్ల చొప్పున.. ఏడాదికి 730 కోట్ల ఆదాయం వస్తోందని.. లోన్లు ఇచ్చేందుకు అన్ని బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని.. అలాంటి ORRను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని విమర్శించారు రేవంత్‌రెడ్డి.

ORR గోల్‌మాల్‌పై సెంట్రల్ విజిలెన్స్ అథారిటీకి, హోమ్ శాఖకు, CAGకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఓఆర్‌ఆర్ లీజులో కేసీఆర్ కుటుంబం ఎన్ని కోట్లు సంపాదించిందో బయటకు తీస్తామన్నారు పీసీసీ చీఫ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News