Lemon Mosquitoes : వేసవికాలం వచ్చిందంటే చాలు తాపం తగ్గించుకోవడానికి నిమ్మరసం తాగుతుంటాం. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించి మనలో తక్షణ శక్తిని కూడా ఇస్తుంది. విటమిన్ సి,బి, యాంటీ యాక్సిడెంట్లు, కాల్షియం ఈ నిమ్మకాయల్లో ఉంటాయి. దీంతో పాటు మన ఇంట్లో అనేక పనులకు నిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరకలను పోగొట్టడంతో పాటు చాలా పనులకు నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. దోమల బెడద ఎక్కువగా ఉంటే కాయిల్స్ లేక జెట్‌లు, రకరకాల స్ప్రేలు వాడుతుంటారు. కానీ వాటి వాసన, పొగ చాలా మందికి పడదు. అంతేకాకుండా అలర్జీలు కూడా వస్తాయి. వీటికి చక్కటి పరిష్కారం నిమ్మ. దోమలు రాకుండా ఇంట్లోనే నిమ్మరసంతో రెమెడీ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకొని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఇంట్లో ఒక మూలన పెడితే దోమలు మీ ఇంటి దరిదాపులోకి కూడా రావు. అంతేకాకుండా రూమ్ ఫ్రెష్‌నర్‌గా కూడా నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. నీళ్లలో నిమ్మతొక్క లేదా రసం వేసి మరిగిస్తే ఇళ్లంతా సువానస వెదజల్లుతుంది. కిచెన్, బాత్‌రూమ్‌ను శుభ్రం చేయడానికి కూడా నిమ్మరసాన్ని వినియోగించవచ్చు. నీళ్లు, నిమ్మరసం సమానంగా ఒక స్ప్రే బాటిల్‌లోకి తీసుకుని మరకలను శుభ్రం చేసుకోవచ్చు. ఫ్రిజ్‌పై పడిన మరకలను కూడా ఇది తొలగిస్తుంది. ప్రతిరోజు కూరగాయలు, పండ్లు కట్ చేయడంతో చాపింగ్ బోర్డుపై మరకలు పడుతుంటాయి. వాటిని నిమ్మతొక్కతో గట్టిగా రుద్ది కడిగితే వెంటనే తొలగిపోతాయి. ఏదైనా నూనెలో నిమ్మరసం కలిపి స్ర్పే చేస్తే క్రిములు, కీటకాలు కూడా దగ్గరికి రావు. అంతేకాకుండా బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి పళ్లుతోముకుంటే తెల్లగా మెరుస్తాయి. యాపిల్ కట్‌చేసిన తర్వాత నిమ్మరసం చల్లితే చాలాసేపటి వరకు తాజాగా ఉంటుంది.