BigTV English

MetaVerse:ఆరోగ్యానికి మేలు చేసే మెటావర్స్..

MetaVerse:ఆరోగ్యానికి మేలు చేసే మెటావర్స్..

MetaVerse:వర్చువల్ టెక్నాలజీ అనేది మార్కెట్లో చాలామందికి అందుబాటులోకి వచ్చింది. ఏదైనా వర్చవల్‌గా అనుభూతి చెందడానికి ఈ టెక్నాలజీ అందరికీ అవకాశం ఇస్తోంది. అందుకే ఇప్పటికే ఈ టెక్నాలజీని ఫన్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఉపయోగిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. అంతే కాకుండా మరెన్నో విషయాలకు కూడా ఇది ఉపయోగపడుతోంది. తాజాగా ఈ వర్చువల్ టెక్నాలజీ మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.


మనం నేరుగా చేసే ప్రతీ విషయాన్ని వర్చువల్‌గా అనుభూతి చెందడానికి మెటావర్స్ అనేది క్రియేట్ అయ్యింది. మెటావర్స్ అనేది ముందుగా కొందరికే పరిచమయ్యింది. కానీ మెల్లగా దీని పాపులారిటీ చూసి 2021లో ఫేస్‌బుక్‌ను మెటా అనే బ్రాండ్‌కు అటాచ్ చేశారు. ఆ తర్వాత మెటావర్స్ గురించి మరికొందరికి తెలిసింది. ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు కేవలం మెటావర్స్‌పై పరిశోధనలు చేయడానికి సిద్ధమయ్యారు. సైన్స్, హెల్త్ రంగాల్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో వారు తెలుసుకోనున్నారు.

మెటావర్స్ సాయంతో ఒకేసారి మహమ్మారి లాంటి వ్యాధులకు చికిత్స అందించలేకపోయినా.. మామూలు వ్యాధుల నుండి దీని పరిశోధన మొదలుపెట్టాలని శాస్త్రవేత్తలు భావించారు. కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలతో ఏర్పాటయిన ఒక టీమ్.. ఈ విషయంపై ప్రత్యేకంగా పరిశోధనలు చేపట్టింది. అయితే మూడు విధాలుగా మెటావర్స్.. కొన్ని వ్యాధులకు చికిత్స అందించడానికి ఉపయోగపడుతుందని ఈ టీమ్ గుర్తించింది. డయాబెటీస్, గుండె వ్యాధులు, గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలపై ముందుగా పరిశోధనలు జరిగాయి.


ముఖ్యంగా డయాబెటీస్, గుండె వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు అనేది మనిషి జీవనశైలిని బట్టి అటాక్ చేస్తాయి. అంతే కాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈ సమస్యలకు కారణం కావచ్చు. ఈ విషయంలో మెటావర్స్ వారికి తోడుగా నిలబడనుంది. మెటావర్స్ పరిశోధన కోసం కొందరిని ఎంపిక చేసి.. వివిధ వాతావరణ పరిస్థితులకు వారి శరీరం ఎలా రియాక్ట్ అవుతుందో చూడనున్నారు. మెటావర్స్‌ను పలు విధాలుగా వినియోగిస్తున్న వారికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మెటావర్స్‌తో మరెన్నో లాభాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా బయట ప్రపంచంలో చూడలేని పచ్చదనాన్ని మెటావర్స్ ద్వారా మనుషులు ఆస్వాదించవచ్చని వారు అన్నారు. అలా మెటావర్స్‌లో ప్రశాంతమైన వాతావరణంలో గడపడం వల్ల మనుషులకు మెంటల్ హెల్త్ సమస్యల నుండి ప్రశాంతత దొరకుతుందన్నారు. అంతే కాకుండా మెటావర్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా వారు గుర్తుచేశారు. మెటావర్స్‌లో ఉండడం అలవాటు అయిపోయినవారికి బయట ప్రపంచంతో కలవడం ఇష్టముండదని వారు తెలిపారు.

ISRO Missions:స్పేస్‌కు వెళ్లనున్న ఇస్రో ఫీమేల్ రోబో ‘వ్యోమిత్ర’.. ఎప్పుడంటే..?

Korean Scientists:బ్రిడ్జిల ధృడత్వాన్ని గమనిస్తూ ఉండే టెక్నాలజీ..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×