BigTV English

Micro resonator is the new technology : మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ.. లైట్‌తోనే సమాధానాలు

Micro resonator is the new technology : మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ.. లైట్‌తోనే సమాధానాలు

Micro resonator is the new technology : ఈరోజుల్లో టెక్నాలజీ ద్వారా చేయలేనిది ఏదీ లేదు. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అయినా కూడా శాస్త్రవేత్తలు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా లైట్ ద్వారా చుట్టు పక్కన జరిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.


మనం ఒక్కొక్కసారి డల్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దానికి కారణం మాత్రం తెలియదు. అయితే దానికి కారణం ఏంటో కనుక్కొని మనకు చెప్పే పరికరం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సైంటిస్టుల కొత్త ప్రయోగం దీనిపైనే. అంతే కాకుండా ఈ పరికరం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్న విషయాన్ని కూడా సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ కొత్త టెక్నాలజీ కొన్ని సంవత్సరాలలో అందుబాటులోకి రానుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మైక్రోరెసోనేటర్ అనే పరికరం ద్వారా ఈ టెక్నాలజీని తయారు చేయడానికి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశారు. లైట్ ద్వారా ఈ పరికరంలోని సెన్సార్స్ పనిచేస్తాయి. అంతే కాకుండా వేవ్‌లెన్త్ ప్రకారంగా ఈ పరికరంలో లైట్‌ను స్టోర్ చేయవచ్చని ఇంజనీర్లు అంటున్నారు.


ఇతర స్పెక్ట్రమ్‌లతో పోలిస్తే మైక్రోరెసోనేటర్ 100 రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు చెప్తున్నారు. దీని ద్వారా ఫ్రీక్వెన్సీను మార్చడానికి సులభం అని వారు అంటున్నారు. లైట్‌తో ఈ కనుక్కునే ఈ టెక్నాలజీ మరికొన్ని కొత్త టెక్నాలజీల తయారీకి తోడ్పడుతుంది. వైరస్, బ్యాక్టీరియా లాంటి వాటిని కనుక్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

జెర్మనియం అనే ఎలిమెంట్ ద్వారా మెక్రోరెసొనేటర్ తయారు చేస్తారు. సిలికాన్ కంటే ముందు జెర్మనియం వాడకం మార్కెట్‌లో ఎక్కువగా ఉండేది. 1947 తర్వాత ఈ ఎలిమెంట్‌ను ఉపయోగించడం చాలావరకు తగ్గించేశారు. ప్రస్తుతం జెర్మనియం ఆప్టికల్ లెన్స్ తయారీలో, ఇన్‌ఫ్రారెడ్ కెమెరాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×