Big Stories

mistakes while making offerings to God : దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా…

mistakes while making offerings to God : నిత్య పూజ చేసే వాళ్లకు కూడా ఒకోసారి దేవుడి నైవేద్యం పెట్టేప్పుడు కొన్నిసందేహాలు వస్తుంటాయి. . పాత కాలంలో దేవుడికి మహానివేదన పెట్టే అలవాటు ఉండేది. మహా నివేదన అంటే భోజనానికి చేసినట్టు ఏర్పాట్లు చేసిన అన్నం పెట్టడమే. వండిన గిన్నె తెచ్చి అందులో రవ్వంత అన్నం తెచ్చి, కూర , పప్పు ఇలా నామా మాత్రంగా నైవేద్యంగా పెడుతుంటారు. నిజంగా అంత ఆహారం మాత్రమే మనం తీసుకుంటామా…ఆలోచించిండి. ఒక పుష్టిగా ఉన్న మనిషి ఎలా అన్నం తింటాడో అలా ఆకులోనో, పళ్లెంలోనో పెట్టి నైవేద్యంగా ఉంచాలి. అంతేకాని పొదుపు పనులు చేయకూడదు.

- Advertisement -

మనం ఇంట్లో తినే ఎంగిలి కంచాలు, పళ్లాల్లో నైవేద్యం పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే స్టీల్ పాత్రల్లో కూడా ప్రసాదాలు నైవేద్యంగా పెట్టకూడదని శాస్త్రం చెబుతోంది. వీలైతే వెండి పాత్రలో పెట్టాలి. కాని పక్షంలో ఆకులో పెట్టడంలో తప్పులేదు. మనం ఎలా అన్నం పెట్టుకుంటామో అలాగే వడ్డించి పెట్టి నివేదన చేయాలి . లేదంటే వండిన పదార్ధాలన్నీ పాత్రలతో అన్నీ దేవుడి ముందు పెట్టి స్వామి నువ్వ ఆరగించిన ఆరగించు స్వామి అనే దేవుడ్ని ప్రార్ధించాలి. నైవేద్యం పెట్టేటప్పుడు తనతోపాటు ఉన్న భావించుకుని అర్పించాలి.

- Advertisement -

వైష్ణవులు ఎంత వంట చేసినా చివరకు ఆ గిన్నెలపై ఒక తులసీ దళం ఉంచుతారు. ఎందుకంటే అలా చేయకపోతే శ్రీకృష్ణుడి వాటిని స్వీకరించడట. సంప్రదాయం తెలిచిన ఔపోసన పట్టి గాయత్రీ మంత్రంతో అన్నం చుట్టూ రక్ష పెట్టి ఆహుతులు తీసుకుని తింటారు. మధ్యలో పానీయం తాగుతున్నామని అక్కడ నీళ్లు కూడా పెడుతుంటారు. అలాగే భోజనం తర్వాత చేతులు కడుక్కోవడానికి ఎంత ప్రాధాన్యం ఉందో కాళ్లు కడగటానికి అంతే ప్రాధాన్యం ఉంది. భోజనానికి ముందు వెనక కూడా చేతులు, కాళ్లు కడుక్కోవాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News