Big Stories

Congress: టి.కాంగ్ కు కొత్త ఇంఛార్జ్.. సీనియర్లు హ్యాపీనా? రేవంతే నెగ్గారా?

Congress: బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ ని నియమించింది అధిష్టానం. ఇప్పటి వరకు ఉన్న మాణిక్కం ఠాగూర్ ని గోవాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు థాక్రేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించింది. గతంలో ఆయన మహారాష్ట్ర మంత్రిగా పని చేశారు.

- Advertisement -

మాణిక్కం ఠాగూర్ పై సీనియర్లు చాలాకాలంగా గుర్రుగా ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి మనిషంటూ.. డబ్బులు తీసుకున్నారంటూ ఏవేవో విమర్శలు చేశారు. హైకమాండ్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల సీనియర్ల సమస్యను తీర్చడానికి అధిష్టానం దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు సైతం మాణిక్కంపై ఆరోపణలు చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న దిగ్విజయ్ సింగ్.. ఓ నివేదికను పార్టీ అధినాయకత్వానికి అందించారు. ఆ నివేదిక ఆధారంగానే మాణిక్కం ఠాగూర్ ను తొలగించి.. మాణిక్ రావు థాక్రేను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా నియమించింది అధిష్టానం.

- Advertisement -

ఇంఛార్జి మార్పు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు అర్థమవుతోంది. సీనియర్లను కాదనలేరు.. అలాగని రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించలేరు. మరి సంక్షోభంను పరిష్కరించేది ఎలా? అందుకే బాగా అనుభవం ఉన్న దిగ్గీరాజాను తెలంగాణకు పంపించారు. ఆయన తనదైన స్టైల్ లో సొల్యూషన్ చూపించారు. సీనియర్లను మెప్పించేలా.. రేవంత్ ను చిన్నబుచ్చకుండా.. మధ్యే మార్గంలో పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ను బలి చేశారని అంటున్నారు.

మాణిక్కంను తామే తప్పించామని సీనియర్లు చెప్పుకోవచ్చు. అధిష్టానం దగ్గర తమ మాటే చెల్లుబాటు అయిందని గొప్పలకు పోవచ్చు. అలా సీనియర్ల ఇగోను సాటిస్ఫై చేసేలా.. కర్ర విరగకుండా.. పాము చావకుండా.. వ్యూహాత్మకంగా ఇంఛార్జిని మార్చేశారని అంటున్నారు.

ఇంఛార్జి మార్పుతో రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదు. పీసీసీ చీఫ్ గా ఆయన ఆధిపత్యం ఆయనకే ఉంటుంది. మాణిక్కంపై వేటుతో సీనియర్లు సైతం కూల్ అవుతారు. మళ్లీ ఎప్పటిలానే కాంగ్రెస్ నడుస్తుంది. ఏ మార్పు ఉండదు. ఒక్క ఇంఛార్జ్ మాత్రమే మారుతారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. మరి, కొత్త ఇంఛార్జినైనా నెగలనిస్తారా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News