BigTV English
Advertisement

Salt Benfits : గ్రహాల అనుగ్రహం పొందాలంటే…..

Salt Benfits : గ్రహాల అనుగ్రహం పొందాలంటే…..

Salt Benfits : కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించడం వల్ల గ్రహాల అనుకూలతలు సాధించే మార్గాలు ఉన్నయి. నవగ్రహాల అనుకూలతల ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. ఉప్పు, గాజు గ్లాస్ కలిపి వాడితే ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా సరే గాజు గ్లాసులో ఉప్పు పోసి మీ ఇంట్లో ఒక ప్రత్యేక స్థానంలో ఉంచితే రోజులు మారి త్వరలోనే మిమ్మల్ని అదృష్ట దేవత వరిస్తుందని పరిహార శాస్త్రం చెబుతోంది. నవగ్రహాలలో శని గ్రహానికి ఉప్పంటే ఎంతో ఇష్టం.


నవగ్రహాలతో రాహువుకి గాజు పాత్రలంటే ఎంతో ఇష్టం. అందుకే శని,రాహువులను ఏకకాలంలో ప్రసన్నం చేయగలిగితే ఆర్ధిక కష్టాల నుంచి బయట పడవచ్చు. ఒక ప్లేటులో గాజు గ్లాసు ఉంచి అందులో గల్లుప్పు ఉంచి ఆ గ్లాసును మీ స్నానాల గదిలో ఉంచాలి. అలా చేయడం వల్ల రాహు, కేతువుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల ఐశ్వర్య వంతులు అవడానికి విశేషంగా ఉపయోగపడుతుంది. బాత్ రూంలో ఉంచలేని పరిస్థితులు ఉంటే మరో మార్గం కూడా ఉంది. ఇంట్లో ఏ మూలైనా సరే తొక్కని ప్రదేశాల్లో ఇలా గ్లాసులో ఉప్పు పోసి ప్లేట్ లో ఉంచవచ్చు. అలా చేస్తే తొందరలోనే ఆర్ధిక ఇబ్బందులను మీరు గట్టెక్కుతారు.

ఉప్పుకు చాలా శక్తులను ఉన్నాయని పరిహార శాస్త్రం చెబుతోంది. పౌర్ణమి, అమావాస్యకి మధ్య చంద్రుడి కళలు మారుతూ ఉంటాయి. అందుకే పౌర్ణమి తిథి రోజు కానీ అమావాస్య నాడు కానీ సముద్రపు గళ్లు ఉప్పు కొద్దిగా నీటిలో పోసి ఆనీళ్లతో స్నానం చేస్తే చంద్రుడి బలం జాతకంలో పెరుగుతుంది. చంద్రుడి అదిష్టాన దేవత లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది .ఐశ్వర్య వంతులు కావాలని అనుకునేవాళ్లు పౌర్ణమి రోజు, అమావాస్య తిథి రోజు కొంచెం గళ్లుప్పు చిటికెడు నీళ్లల్లో వేసి స్నానం ఆచరించాలి. ఇంట్లో పిల్లలకు గల్లుప్పు కలిసి నీళ్లతో స్నానం చేయిస్తే వాళ్లకు ఉన్న దిష్టదోషాలు అన్నీ పోతాయి. వాళ్లు ఆరోగ్య వంతులు అవుతారు.


తీవ్రమైన ఒత్తిడి ఉన్న వాళ్లు, శారీరక శ్రమ ఉన్న వాళ్లు రోజూ రాత్రి పూట గల్లుప్పు ఉన్న కలిపిన నీళ్లతో కాళ్లు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల శారీరక శ్రమ, అలసట రెండు మాయమవుతాయి. శుక్రవారం పూట మొట్ట మొదట మీరు సంపాదించిన ధనంతో ఉప్పు కొనాలి. ఆవేళ ఉదయమే ఈ పని చేయాలి. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుందని పరిహారశాస్త్రం చెబుతోంది. . అలాగే దీపావళి రోజున ఉప్పు నింపిన గాజు సీసాని ఇంట్లో ఎదో ఒక మూల లేదా బాత్ రూమ్ లో పెడితే నెగటివ్ ఎనర్జీలు బయటకు పోయి లక్ష్మి దేవి ఇంటిలో స్థిరపడుతుంది. ఇంటిలో లక్ష్మి దేవి కొలువై ఉంటే సిరి సంపదలతో సంతోషంగా ఉంటాం.

Tags

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×