EPAPER

Twitter : అందర్నీ బాదేస్తానంటున్న మస్క్!

Twitter : అందర్నీ బాదేస్తానంటున్న మస్క్!

Twitter : సంచలన నిర్ణయాలతో షాకుల మీద షాకులిస్తున్న ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్… ఇప్పుడు ట్విట్టర్ యూజర్లందరికీ షాకిచ్చేలా ఉన్నాడు. ఇప్పటికే బ్లూ టిక్ వినియోగదారుల నుంచి నెలకు 8 డాలర్లు వసూలు చేస్తున్న మస్క్… ఇప్పుడు ట్విట్టర్ యూజర్లందరి నుంచీ నెలవారీ ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. దాంతో… ఆ బాదుడు ఎలా ఉంటుందోనని యూజర్లు ఆందోళన చెందుతున్నాడు.


ప్రస్తుతం వెరిఫైడ్ యూజర్ల నుంచి నెలకు 8 డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ.650కి పైగా వసూలు చేస్తున్నాడు… మస్క్. ఈ బాదుడు ఐదారు దేశాల్లోనే అమల్లోకి వచ్చినా… త్వరలో ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడం ఖాయం. బ్లూ టిక్ సేవలకు 8 డాలర్లు వసూలు చేయాలని మస్క్ నిర్ణయించుకున్నప్పుడే… ఎప్పటికైనా యూజర్లందరి నుంచీ నెలవారీ ఛార్జీలు వసూలు చేసే ప్రణాళిక సిద్ధం చేస్తాడని భావించారందరూ. కానీ… ఇంత త్వరగా ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చే ఆలోచన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. దాంతో… ఎవరూ ఊహించని పని చేయడమే మస్క్ స్పెషాలిటీ అని… దీన్ని మాత్రం చేయకుండా ఎలా ఉంటాడని అప్పుడే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ట్విటర్‌ యూజర్లందరి నుంచి నెలవారీ ఛార్జీల వసూలుపై మస్క్ సంస్థ కీలక ఉద్యోగులతో చర్చించాడని చెబుతున్నారు. నెలలో కొన్ని రోజులు ఉచితంగా సర్వీసు అందించినా, ఆ తర్వాత ఛార్జీలు వసూలు చేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మస్క్‌ ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. కొందరు మాత్రం… కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఫీచర్ అభివృద్ధి కోసం ఎలాన్‌ మస్క్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడని… అది ఓ కొలిక్కి వచ్చేదాకా పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అంశంపై ఇప్పట్లో నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. కానీ… పూటకో నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న మస్క్… సాధారణ యూజర్ల నుంచి కూడా నెలవారీ ఛార్జీ వసూలు చేస్తానని ఇప్పటికిప్పుడు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


Related News

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

Big Stories

×