BigTV English

Double-decker AC buses : జనవరిలో హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు

Double-decker AC buses : జనవరిలో హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ ఏసీ బస్సులు


Double-decker AC buses : డబుల్ డెక్కర్ బస్సులంటే ఈ తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ… 2005 వరకూ హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవి. ఫ్లై ఓవర్ల నిర్మాణం కారణంగా చాలా డబుల్ డెక్కర్ బస్ సర్వీసుల్ని రద్దు చేసినా… సికింద్రాబాద్-జూపార్క్ మార్గంలో ఒకటి… కోఠి-పటాన్ చెరువు మార్గం మరో సర్వీసు నడిచేది. కానీ ఓసారి ఓ డ్రైవర్ తాను నడుపుతున్నది డబుల్ డెక్కర్ బస్సు అనే సంగతి మర్చిపోయి… సికింద్రాబాద్ రైల్వే అండర్ బ్రిడ్జిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలు కావడంతో… అప్పటి నుంచి డబుల్ డెక్కర్ బస్సు సర్వీసుల్ని హైదరాబాద్ లో పూర్తిగా రద్దు చేశారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత… మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సుల్ని నడిపేందుకు రంగం సిద్ధం చేశారు.

హైదరాబాద్ రోడ్లపై వచ్చే ఏడాది జనవరి నుంచి… అంటే మరో రెండు నెలల్లో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు HMDA ప్రయత్నిస్తోంది. ఇప్పటికే… ఆరు ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది. సిటీలో 12 నుంచి 14 గంటల పాటు డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపాలని ప్లాన్ చేస్తున్నారు. పటాన్ చెరు-కోఠి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్ గంజ్-మెహదీపట్నం తదితర మార్గాల్లో ఈ బస్సులు నడిచే అవకాశం ఉంది. ఒక్కో డబుల్ డెక్కర్ బస్సులో 60కి పైగా సీట్లు ఉంటాయని… ఎంపిక చేసిన రూట్లలో ఈ బస్సులను నడిపితే… ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించవచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.


డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని రెండేళ్లు లేదా రెండు లక్షల కిలోమీటర్ల వారంటీతో HMDA కొనుగోలు చేయబోతోంది. అంతేకాదు… ఐదేళ్ల పాటు వార్షిక నిర్వహణ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే… వచ్చే జనవరిలోనే హైదరాబాద్ రోడ్లపై మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని చూడొచ్చు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×