BigTV English
Advertisement

Musk:సంపద కరిగె.. గిన్నిస్ రికార్డుకెక్కె..

Musk:సంపద కరిగె.. గిన్నిస్ రికార్డుకెక్కె..

Musk:టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు గిన్నిస్ రికార్డులకు ఎక్కాడు. అయితే.. ఏదో గొప్ప పని చేసి మాత్రం కాదులెండి. సంపద పోగొట్టుకోవడంలో మస్క్‌ను మించినోళ్లు లేరని గుర్తించిన గిన్నిస్… ఆ రికార్డు నీదేనంటూ మస్క్‌కు తమ బుక్కులో చోటిచ్చింది. ఇంతకీ రికార్డు స్థాయిలో మస్క్ కోల్పోయిన సంపద ఎంతని అనుకుంటున్నారు? గిన్నిసోళ్ల ప్రకారం జస్ట్ 182 బిలియన్ డాలర్లు. వాస్తవానికి ఇది 200 బిలియన్ డాలర్ల వరకూ ఉండొచ్చని అంటున్నారు. అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.16,35,340 కోట్లు. అక్షరాలా 16 లక్షల 35 వేల 340 కోట్ల రూపాయల్ని… కేవలం ఏడాది వ్యవధిలో నష్టపోయాడు… మస్క్. ప్రపంచ చరిత్రలో ఇంత తక్కువ వ్యవధిలో ఎవరూ ఇంత భారీగా సంపద కోల్పోలేదని అంటోంది… గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ.


చాలా తక్కువ వ్యవధిలోనే ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు… మస్క్. ఫోర్బ్స్‌ ప్రకారం… 2021లో మస్క్ సంపద 320 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఆ సంపద విలువ 138 బిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది వ్యవధిలో ఆయన కచ్చితంగా ఎంత సంపద కోల్పోయారనేది అంచనా వేయలేక పోయినా… 182 బిలియన్ డాలర్లు నష్టపోయి ఉంటారని లెక్కలేశారు. అంతకుముందు, ఏడాది వ్యవధిలో 58.6 బిలియన్ డాలర్లు కోల్పోయిన కుబేరుడిగా రికార్డు నెలకొల్పిన మస్క్… ఇప్పుడు తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు.

ఎలాన్‌ మస్క్‌ ఆస్తులు ఎక్కువగా టెస్లా షేర్ల రూపంలోనే ఉన్నాయి. ట్విట్టర్ కొన్న తర్వాత మస్క్ టెస్లా షేర్లను భారీగా అమ్మేశాడు. ఇన్వెస్టర్లు కూడా… మస్క్ ట్విట్టర్ మీద తప్ప టెస్లా మీద సరిగ్గా దృష్టిపెట్టడం లేదని భావించి… ఆ కంపెనీ షేర్లను అమ్మేయడం మొదలుపెట్టారు. దాంతో… 2022లో టెస్లా షేరు ధర 65 శాతం పతనమైంది. అయినా… ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన కార్ల కంపెనీ టెస్లానే. కంపెనీ అధినేత మస్క్ మాత్రం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 198 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×