BigTV English

USA: విమానాలు బంద్.. అమెరికా ఆగమాగం.. సైబర్ అటాకా?

USA: విమానాలు బంద్.. అమెరికా ఆగమాగం.. సైబర్ అటాకా?

USA: అమెరికా తాము ప్రపంచంలోకే అత్యంత పర్ ఫెక్ట్ దేశమని అనుకుంటుంది. పూర్తిగా టెక్నాలజీ మీదే ఆధారపడుతుంది. ఆ టెక్నాలజీ మొరాయిస్తే.. ఎంత విపత్కర పరిస్థితి వస్తుందో అగ్రరాజ్యానికి తెలిసొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా అమెరికా వ్యాప్తంగా విమానాలు ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి. దాదాపు 2500 సర్వీసులు ఆలస్యమయ్యాయి. పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. విషయం వైట్ హౌజ్ వరకూ చేరింది. ఇంతకీ అసలేం జరిగిందంటే…


ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ (FAA)లో సాంకేతిక లోపంతో అమెరికా వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. విమాన మార్గాల్లో మార్పులు చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసేందుకు FAA పని చేస్తుంది. ఇప్పుడు అందులోనే సమస్య వచ్చింది. FAA ఎయిర్‌లైన్స్ కు ఇచ్చే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో Technical Glitch తలెత్తిందని ఎఫ్‌ఏఏ ట్విటర్‌లో తెలిపింది.

సాంకేతిక సమస్యను సాల్వ్ చేసేందుకు నిపుణులు పని చేస్తున్నారు. అయితే, ఇది ఎప్పటికి పరిష్కారం అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. హాట్‌లైన్‌ను యాక్టివేట్ చేసినట్లు అమెరికా రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. దేశీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.


అమెరికా వ్యాప్తంగా 2500లకు పైగా విమానాలు ఆలస్యమైనట్టు తెలుస్తోంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే ఉండిపోయారు. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులతో మండిపడుతున్నారు.

విషయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు వివరించారు రవాణా శాఖ మంత్రి. సైబర్‌ అటాక్ జరిగిందని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అయితే, కారణాలపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు.

అమెరికాలో ప్రతీరోజు సుమారు 21,000కు పైగా విమానాలు నడుస్తుంటాయి. అందులో దాదాపు 2,000 వరకూ అంతర్జాతీయ విమానాలు ఉంటాయి. FAAలో టెక్నికల్ గ్లిట్చ్ తో ఇప్పుడు ఈ వేలాది సర్వీసులపై ప్రభావం పడింది.

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×