BigTV English

Musk-Iphone : ఐఫోన్‌ తొలి హ్యాకర్‌కు 12 వారాల డెడ్ లైన్ పెట్టిన మస్క్…

Musk-Iphone : ఐఫోన్‌ తొలి హ్యాకర్‌కు 12 వారాల డెడ్ లైన్ పెట్టిన మస్క్…

Musk-Iphone : ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ దెబ్బకు అంతా ఆ కంపెనీ నుంచి వైదొలుగుతున్నారు. ఆయన చెప్పినట్లు పనిచేయలేక విసుగెత్తి, కొత్త కంపెనీల్లో ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ముఖ్య ఉద్యోగులు మానేసి వెళ్లిపోవడంతో… ట్విటర్‌కు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కొరత భారీగా ఏర్పడింది. దాంతో… సంస్థలో సమస్యల పరిష్కారానికి సాంకేతిక, సేల్స్‌ విభాగాల్లో మస్క్ కొత్త నియామకాలు చేపట్టాడని చెబుతున్నారు. అందులో భాగంగా… ఏళ్ల తరబడి అనేక మంది నిపుణులు పరిష్కరించలేని సమస్యను… 12 వారాల్లోగా పరిష్కరించాలంటూ ఓ ఉద్యోగికి డెడ్ లైన్ విధించాడు… మస్క్. దాంతో… ఉద్యోగులకు డెడ్ లైన్లు విధించడంలో మస్క్ తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


ట్విటర్‌ సెర్చ్‌లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు జార్జ్‌ హోట్జ్‌ అనే వ్యక్తిని నియమించాడు… మస్క్. అతను ఎవరో కాదు… 2007లో ఐఫోన్‌ హ్యాక్‌ చేసిన తొలి వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థలో జార్జ్‌ హోట్జ్ కొన్నాళ్లు పనిచేశాడు. ట్విట్టర్లో 12 వారాల ఇంటర్న్‌షిప్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఆ మధ్య జార్జ్‌ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన మస్క్… ఉద్యోగం గురించి చర్చిద్దామని బదులిచ్చాడు. అందుకు జార్జ్‌.. ఉద్యోగం అవసరంలేదని, కేవలం 12 వారాల ఇంటర్న్‌షిప్‌లో రివర్స్‌ ఇంజనీరింగ్ సాయంతో వెయ్యి మైక్రో సర్వీసెస్‌ను సరిచేస్తానని ట్వీట్ చేశాడు. దీని వల్ల ట్విటర్‌ సెర్చ్ సమస్య పరిష్కారమవుతుందని జార్జ్‌ మస్క్ కు చెప్పాడు. ఇప్పటికే ట్విట్టర్‌ సెర్చ్‌లో తమకు కావాల్సిన సమాచారం దొరకడం లేదని పలువురు నెటిజన్లు ఫిర్యాదులు చేస్తుండటంతో… ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను జార్జ్‌కు అప్పగించాడు… మస్క్. అంతేకాదు… జార్జ్ 12 వారాల ఇంటర్న్‌షిప్‌ అడిగాడు కాబట్టి… అదే గడువులోగా సెర్చ్ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని డెడ్ లైన్ విధించాడు… మస్క్. మరి జార్జ్ హోట్జ్ తనపై మస్క్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడో లేదో చూడాలంటే మరో 3 నెలలు వేచిచూడాలి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×