BigTV English

Musk : పోతే పొండి.. నో రిస్క్ అంటున్న మస్క్!

Musk : పోతే పొండి.. నో రిస్క్ అంటున్న మస్క్!

Musk :ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు వస్తున్నా… ఉద్యోగులు ఎంతో తిట్టుకుంటున్నా… మస్క్ మాత్రం లైట్ తీస్కో అంటున్నాడు. నాకు నచ్చినట్టు నేను చేసుకుపోతానంటున్నాడు. ట్విట్టర్ దివాళా తీయకుండా కాపాడటమే తన లక్ష్యం అంటున్నాడు… మస్క్. అయితే అతని నిర్ణయాలు నచ్చనివాళ్లు మాత్రం… సంస్థను గట్టెక్కించడం మాట పక్కన పెట్టు… నువ్వే ముంచేట్టున్నావు అంటూ కామెంట్ చేస్తున్నారు.


తాజాగా ట్విట్టర్లో ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలపై స్పందించిన మస్క్… అత్యుత్తమ సిబ్బందే సంస్థలో ఉంటారని తేల్చిచెప్పాడు. ఇప్పుడు సంస్థను వీడుతున్నది టాలెంట్, ఓపిక లేని వాళ్లేనని… అలాంటి వాళ్లు మాకు అక్కర్లేదని, భవిష్యత్ మీద కూడా ఎలాంటి బెంగా లేదని ప్రకటించాడు. దాంతో.. వీడెక్కడి మొండిఘటంరా బాబూ అనుకుంటున్నారు… అందరూ.

మూడు రోజుల కిందట మస్క్ పంపిన ఇ-మెయిల్ చూసిన ట్విట్టర్ ఉద్యోగులు… అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కష్టపడి పనిచేస్తారా? లేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతారా? అని మస్క్ ఇ-మెయిల్ ద్వారా అల్టిమేటం ఇవ్వడంతో… తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మస్క్ కోరడంతో… మేమైనా బానిసలమా? అంటూ వందల మంది ఉద్యోగులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఎంత ధైర్యం ఉంటే YES అనే ఆప్షన్ తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా ఇ-మెయిల్ పంపుతాడు? అంటూ సంస్థకు గుడ్ బై చెప్పారు.


కంపెనీ అంతర్గత చాట్ గ్రూపుల్లో… ఉద్యోగులు రాజీనామాకు చిహ్నంగా సెల్యూట్ ఎమోజీలు, వీడ్కోలు సందేశాలు భారీగా పోస్ట్ చేయడంతో కళ్లు తెరిచిన మస్క్… వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. ముఖ్యమైన ఉద్యోగులు కొందరు కంపెనీని వీడకుండా మస్క్‌, ఆయన సలహాదారులు… వారితో సంప్రదింపులు కూడా జరిపారు. అయినా ఉద్యోగులు వెనక్కి తిరిగివచ్చే ప్రసక్తే లేదంటున్నారని సమాచారం. దాంతో… పోతే పొండి అనే మొండివైఖరినే మస్క్ ప్రకటించాడని అంటున్నారు. మరోవైపు…పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రాజీనామాలు చేస్తే… ట్విట్టర్‌ కార్యకలాపాలు సమర్థంగా సాగుతాయా? అని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే కంపెనీ ఏమైపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×