BigTV English
Advertisement

Musk:పిట్ట పాతది.. చాట్‌బాట్‌ కొత్తది..

Musk:పిట్ట పాతది.. చాట్‌బాట్‌ కొత్తది..

Musk:కొత్త ఒక వింత, పాత ఒక రోత అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇప్పుడు ఎలాన్ మస్క్ వైఖరి చూస్తుంటే ఇదే గుర్తుకొస్తోంది. ఎందుకంటే… ట్విట్టర్ కొన్నాక తన వింత వింత నిర్ణయాలతో ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థకంలో పడేసిన మస్క్‌కు… ఇప్పుడదంతా రోత వ్యవహారంలా కనిపిస్తోంది. అందుకే… ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా పనిచేసే కొత్త చాట్‌బాట్‌ను అభివృద్ధి చేస్తాడట. ఆయన నిర్ణయం తెలియగానే… ట్విట్టర్‌నే సరిగ్గా హ్యాండిల్ చేయలేని వ్యక్తి ఇప్పుడు చాట్‌జీపీటీకి పోటీగా కొత్త చాట్‌బాట్‌ రూపొందిస్తాడా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


నిజానికి ఐదేళ్ల కిందట చాట్‌జీపీటీపై వ్యతిరేక వైఖరితో ఉన్నాడు… మస్క్. కానీ, ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా చాట్‌జీపీటీకి విపరీతమైన పాపులారిటీ దక్కడంతో… తాను కూడా అందులో వేలు పెట్టాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అన్ని దిగ్గజ టెక్‌ సంస్థలు కూడా చాట్‌జీపీటీ తరహాలో చాట్‌బాట్‌ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గూగుల్‌ ‘బార్డ్‌’ పేరుతో చాట్‌బాట్‌ను అభివృద్ధి చేస్తుండగా… మెటా, స్నాప్‌చాట్ లాంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ సిద్ధం చేసే పనిలో ఉన్నాయి. తాజాగా ఈ రేసులోకి ట్విట్టర్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా వచ్చేశారు. చాట్‌జీపీటీ తరహాలో ఏఐ ఆధారిత కొత్త టూల్‌ను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఏఐ చాట్‌బాట్‌ అభివృద్ధి కోసం గూగుల్ మాజీ ఉద్యోగి ఇగోర్‌ బాబుష్కిన్‌ను మస్క్ నియమించుకున్నాడని చెబుతున్నారు.

2015లో శామ్‌ ఆల్టమన్‌ బృందం ఓపెన్‌ఏఐని స్థాపించినప్పుడు… అందులో మస్క్ పెట్టుబడులు పెట్టాడు. మూడేళ్ల తర్వాత తన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్ అణుబాంబు కంటే ప్రమాదమని, అందుకే తాను ఓపెన్‌ఏఐ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నానని అప్పట్లో మస్క్ అన్నాడు. నిరుడు డిసెంబరులో కూడా… ఏఐ ఓ భయానక అనుభవం అని ట్వీట్ చేసిన మస్క్… ఇప్పుడు ఏకంగా ఏఐ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసేందుకు సిద్ధపడటంపై… సాంకేతిక నిపుణులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×