Nagarkurnool Crime: ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి కూడా చేసుకున్నారు. అన్యోన్యంగా ఉండేవారు.. ఆ అన్యోన్యత మూడునాళ్ల ముచ్చటగానే సాగింది. ఆ ప్రేమ కాస్త ద్వేషంగా మారి, ఏకంగా కట్టుకున్న భర్తను కడతేర్చే వరకు తీసుకు వెళ్లడం విశేషం. ఈ దారుణ ఘటనకు దారి తీసింది మాత్రం అక్రమ సంబంధమేనని పోలీసులు తేల్చారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన కీర్తి, జగదీష్ లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించగా, వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 2011లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని, తమ సంసారాన్ని సంతోషంగా సాగిస్తూ వచ్చారు. బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తూ జగదీష్, కుటుంబ పోషణ సాగించేవారు. అయితే కీర్తికి నాగరాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగేదట.
ఆ విషయం గ్రహించిన జగదీష్ పలుమార్లు కీర్తిని వారించేవాడు. అయినా కీర్తి మాత్రం అదేరీతిలో తన ప్రవర్తన కొనసాగించేది. జగదీష్ నుండి రోజురోజుకి ఒత్తిడి అధికం కాగా, కీర్తి, నాగరాజుతో కలిసి తన భర్తను హత్య చేయాలని కుట్ర పన్నింది. భర్త ఒక్కడే ఉన్న సమయంలో నాగరాజుకు సమాచారం అందించి, ఏకంగా తన భర్తను హత్య చేసింది. ఇక్కడే కీర్తి అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. జగదీష్ ను హత్య చేసిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కీర్తి ప్రయత్నించింది.
అయితే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు లోతుగా సాగించి, అసలు నిజాన్ని కక్కించారు. చివరకు తన భర్తను తానే హత్య చేసినట్లు, అందుకు నాగరాజుతో పాటు పలువురు సహకరించినట్లు అంగీకరించగా, ఈ కేసులో కీర్తితో పాటు నాగరాజును, మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జగదీష్ చివరికి, తన భార్య చేతిలో హతం కావడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్యగా చిత్రీకరించినా, హత్యగా తేల్చడంలో సఫలీకృతులయ్యారు.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
2011లో ప్రేమ వివాహం చేసుకున్న కీర్తి, జగదీష్
బిజినపల్లి జిల్లా పరిషత్ కార్యాలయంల అటెండర్ గా పనిచేస్తున్న జగదీష్
నాగరాజుతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధం పెట్టుకున్న కీర్తి… pic.twitter.com/4PmSoDy04u
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024