Nayanthara – Dhanush:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)విడాకుల వేళ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎప్పుడైతే నయనతార డాక్యుమెంటరీ ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పటినుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో ధనుష్ , నయనతార మధ్య ఘర్షణ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ సమయంలోనే బడ్జెట్ విషయంలో నయనతార, ధనుష్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమస్య పది సంవత్సరాల తర్వాత మళ్లీ బయటపడడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరూ చర్చనీయాంశంగా మారారు.
హాట్ టాపిక్ గా మారిన నయన్ – ధనుష్ మధ్య ఘర్షణ..
ఇకపోతే తాజాగా నెట్ ఫ్లిక్స్ (Netflix )నయనతార డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అందులో ‘నానుమ్ రౌడీధాన్’ సినిమా పాటను ఉపయోగించుకోవడానికి ధనుష్ అంగీకరించలేదు. పైగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందడానికి నయనతార. ధనుష్ చుట్టూ రెండేళ్లు తిరిగిందట. అయినా సరే ఆయన ఈ విషయానికి అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన కొన్ని దృశ్యాలను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించింది. అయితే ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైనప్పుడు ఇది చూసిన ధనుష్ తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ వాడుకుందని రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ధనుష్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో నయనతార మూడు పేజీల లేఖ బహిరంగంగా విడుదల చేస్తూ ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
నయనతారపై హైకోర్టులో కేస్ వేసిన ధనుష్..
ఇకపోతే ఆ తర్వాత నయనతార ప్రకటనకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేరుగా ఆమెపై చెన్నై హైకోర్టులో కేసు చేశాడు ధనుష్. ముఖ్యంగా నయనతార తో పాటు ఆమె భర్త నానుమ్ రౌడీ దాన్ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్ (Vignesh Shivan)తో పాటు సొంత నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్ పై కేసు వేశాడు ధనుష్.. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని ధనుష్ తన పిటిషన్ లో పేర్కొనగా, ఈ కేసులను విచారించిన న్యాయమూర్తి నయనతారను సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.
కర్మ వడ్డీతో సహా తిరిగిస్తుంది..
అయితే తాజాగా ధనుష్ తనపై కేసు వేయడంతో ఆయనను పరోక్షంగా టార్గెట్ చేస్తూ తన ఇన్ స్టా పేజీలో ఒక స్టోరీని పోస్ట్ చేసింది నయనతార. తన ఇన్స్టా స్టోరీలో.. “మీరు అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు, అది అప్పుగా తీసుకోబడుతుంది. అది నీకు వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది. కర్మ ఎప్పుడూ ఊరికే పోదు.. కచ్చితంగా వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది”..అంటూ కర్మ చెప్పినట్లుగా తెలిపింది నయనతార. అంతేకాదు దానికి అండర్లైన్ కూడా చేసింది. ఇక ఆమె ఈ పోస్టును నేరుగా ధనుష్ ని ఉద్దేశించి పెట్టకపోయినా, అది ధనుష్ పైనే సెటైర్లు వేసింది అన్నట్టుగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది.
కొద్ది రోజుల క్రితమే విడాకులు..
అసలు విషయంలోకి వెళితే.. ధనుష్ కి కొద్ది రోజుల క్రితమే విడాకులు వచ్చాయి. 2004లో రజనీకాంత్(Rajinikanth) పెద్ద కుమార్తె ఐశ్వర్య (Aishwarya)ను ఆయన వివాహం చేసుకోగా.. 2022లోనే విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక కొద్ది రోజుల క్రితమే విడాకులు మంజూరు చేసింది కోర్టు. ఇప్పుడు దానిని విమర్శిస్తూ.. నయనతార ఇలా పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి నయనతార దేనిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ.. ప్రస్తుతం ధనుష్ తో ఉన్న గొడవ, ఆయన విడాకులు తీసుకోవడం అన్నింటిని కూడా లింక్ చేస్తున్నారు నెటిజన్స్.