iphone Vs Samsung : iPhone 15 Pro, Samsung Galaxy S24 Ultra మెుబైల్స్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ మెుబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. దీంతో అసలు వీటిలో ఏ మెుబైల్ బెస్ట్ అని టెక్ ప్రియులు తెగ ఆలోచించేస్తున్నారు. అయితే వీటి ఫీచర్స్ పై ఓ లుక్కెస్తే ఏ మెుబైల్ బెస్టో ఇట్టే తెలిసిపోతుంది.
2024లో లాంఛ్ అయిన బెస్ట్ మెుబైల్స్ లో ఐఫోన్ 15 ప్రో, సామ్ సాంగ్ గేలక్సీ S24 అల్ట్రా ఉన్నాయి. అయితే ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్‌లో 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 99,900గా ఉంది. ఇక Samsung Galaxy S24 Ultra ధర అమెజాన్‌లో రూ.99,199గా ఉంది. మరి ఈ మెుబైల్స్ డిజైన్, కమెరా, ప్రాసెసర్, డిస్ ప్లే ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.
డిజైన్ –
ఐఫోన్ 15 ప్రో టైటానియం ఫ్రేమ్‌తో, తేలికగా వచ్చేసింది. సిగ్నేచర్ ఫ్లాట్ ఎడ్జ్‌లు, ప్రీమియం గ్లాస్ బ్యాక్‌తో లాంఛ్ అయింది. Samsung Galaxy S24 అల్ట్రా ఫ్లాట్ డిస్‌ప్లే కర్వ్డ్ ఎడ్జెస్ తో టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది.
డిస్ ప్లే –
ఐఫోన్ 15 ప్రో 6.1-అంగుళాల డిస్‌ప్లేతో రాగా శామ్సంగ్ 6.8-అంగుళాల స్క్రీన్‌తో వచ్చేసింది. Galaxy S24 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 QHD+ రిజల్యూషన్‌తో పెద్ద 6.8-అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది.
iPhone 15 ప్రో XDR డిస్‌ప్లే, HDR10 డాల్బీ విజన్ 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. శామ్సంగ్ ఫోన్ 2600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తే, ఐఫోన్‌లో 2000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. రెండు ఫోన్‌లు IP68 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
ప్రాసెసర్ –
ఐఫోన్ 15 ప్రో A17 ప్రో చిప్ తో గేమింగ్, ఫోటోగ్రఫీ, AI- ఆధారిత టూల్స్ కు సపోర్ట్ చేస్తుంది. Galaxy S24 అల్ట్రా Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌తో వచ్చేసింది.
కెమెరా –
Galaxy S24 Ultra క్వాడ్-కెమెరా సెటప్‌తో 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్, అల్ట్రా-వైడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15 ప్రో 48-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో లాంఛ్ అయింది.
సాఫ్ట్వేర్ –
iPhone 15 Pro iOS 18లో నడుస్తుంది. Galaxy S24 Ultra Android 14 ఆధారంగా One UI 6పై నడుస్తుంది.
బ్యాటరీ –
Samsung Galaxy S24 Ultra పెద్ద 5000mAh బ్యాటరీతో వచ్చేసింది. iPhone 15 Pro 4441mAh బ్యాటరీతో వచ్చేసింది. ఇక ఈ రెండు మెుబైల్స్ వేగవంతమైన ఛార్జింగ్‌ను అందిస్తాయి. అయితే S24 అల్ట్రా వేగవంతమైన వైర్డు ఛార్జింగ్‌కు (45W ) సపోర్ట్ చేస్తే iPhone 15 Pro (20W) కు సపోర్ట్ చేస్తుంది.
ధర –
ఐఫోన్ 15 ప్రో రిలయన్స్ డిజిటల్‌లో 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ. 99,900గా ఉంది. ఇక Samsung Galaxy S24 Ultra ధర అమెజాన్‌లో రూ.99,199గా ఉంది. సో ఈ రెండు మెుబైల్స్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం కొనాలనుకుంటే మీరు ట్రై చేసేయండి.
ALSO READ : ఓటీపీ రూల్స్ మారుతున్నాయ్..!