Rishiteshwari Case: తొమ్మిదేళ్ల క్రితం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసును తొమ్మిదేళ్ల విచారణ అనంతరం గుంటూరు న్యాయస్థానం కొట్టివేసింది.
తెలంగాణలోని వరంగల్ కు చెందిన రిషితేశ్వరి గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా తన విద్యను కొనసాగించేది. అయితే రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడడంతో, పోలీసులు ఘటన స్థలం వద్ద సూసైడ్ నోట్ ను గుర్తించారు. తాను తన తోటి విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రిషితేశ్వరి సూసైడ్ నోట్ లో పేర్కొంది. దీనితో నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని, వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపణలు రాగా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ ఘటన సంచలనంగా మారింది.
విద్యార్థి సంఘాలు, ఆమె కుటుంబ సభ్యులు నిరసనలు తెలిపి, రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని చట్టరీత్యా శిక్షించాలని హోరెత్తించారు. అనంతరం పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 9 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ నిర్వహించిన గుంటూరు జిల్లా ఐదవ కోర్టు శుక్రవారం తీర్పును వెలువడించింది. అభియోగాలు నమోదైన వారి వాదనలు విన్న న్యాయస్థానం, ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునివ్వడంతో మరో మారు రిషికేశ్వరి కేసు వార్తల్లో నిలిచింది.
Also Read: Cyclone Fengal : ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు .. పెంగల్ ఎఫెక్ట్..
తాజాగా న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఆమె తల్లి మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నామని, అయినా తమ కూతురికి న్యాయం అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాము పోరాడే స్థితిలో లేమని, తమ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే రిషితేశ్వరి తండ్రి మాట్లాడుతూ.. తన కూతురు స్వయంగా రాసిన డైరీలను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోపోవడానికి కారణం తెలియడం లేదని, ఆ డైరీ ని తన కుమార్తె స్వయంగా రాసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కూడా అందించిందన్నారు.
10 ఏళ్లు పోరాటం చేశాం.. అయినా న్యాయం జరగలేదు..
కన్నీటి పర్యంతమైన రిషితేశ్వరి తల్లి#Guntur #RishiteswariCase #Verdict #BigTV https://t.co/u0C7eKsOji pic.twitter.com/eoBgxYbFzm
— BIG TV Breaking News (@bigtvtelugu) November 29, 2024