BigTV English

Nallamala Forest: 154 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో ప్రత్యక్షమైన అడవి దున్న

Nallamala Forest: 154 ఏళ్ల తర్వాత నల్లమల అడవుల్లో ప్రత్యక్షమైన అడవి దున్న

Nallamala forest: నల్లమల అడవుల్లో ఓ అడవి దున్న ప్రత్యక్షమైంది. నల్లమల్లలో సంచరిస్తున్న ఈ అరుదైన జంతువు.. 154 ఏళ్ల తర్వాత కనిపించిందని వెల్లడించారు. నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అడవిలో అధికారులు అడవి దున్న ఆనవాళ్లు సైతం గుర్తించారు. నల్లమల్లలో ఒకప్పుడు విస్తారంగా సంచరించే ఈ అడవి దున్నలు.. చివరిసారిగా 1870లో కనిపించిందని, మళ్లీ ఇప్పుడు కనిపిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.


ఆత్మకూరులోని బైరూట్లి రేంజ్‌లో ఏర్పాటు చేసిన కెమెరాలో అడవి దున్న చిక్కిందని అధికారులు వెల్లడించారు. మొదట ఈ అరుదైన జంతువును ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్‌లో గుర్తించిందని ఫారెస్ట్ అధికారి సాయిబాబా తెలిపారు. ఆ తర్వాత జూన్‌లో బైర్లూటి రేంజ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కర్ణాటక నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కిలోమీటర్లు దాటుకొని రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ కనుమలలో సంచరించే ఈ అడవి దున్నలు గుంపులో నుంచి తప్పిపోవడం లేదా దారి తప్పి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. నల్లమలలో విస్తారమైన గడ్డి క్షేత్రాలు, రకరకాల వృక్షాలు ఉండడంతో చాలా రకాల జంతువులు వస్తాయని, తాజాగా, అడవి దున్న రావడంపై ఫారెస్ట్ అధికారులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: APMDC, PCB Documents burn: ఏపీలో.. ఏపీఎండీసీ, పీసీబీ కీలక పేపర్స్ దహనం, ఎవరి పని?

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన ఈ అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల అటవీ శాఖ ప్రయత్నాల మొదలు పెట్టింది. అయితే ఇందుకోసం సహకారం అందించేందుకు వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ సంస్థ ముందుకొచ్చింది. అదే విధంగా ఈ కార్యక్రమానికి ప్రముఖ ఫార్మా స్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా అడవి దున్నలను తరలించే పనిలో ఉండగానే.. అటవీ అధికారులకు అనుకోని అతిథి కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది.

అడవి దున్న రావడంపై నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా స్పందించారు. పెద్దపులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. కానీ అడవి దున్న..కిలోమీటర్లు మైదాన ప్రాంతాలను దాటుకొని నల్లమల చేరడం ఆశ్చర్యమేనని, పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందన్నారు.

Related News

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Big Stories

×