BigTV English

Sun : సూర్యుడిపై కొత్త పరిశోధనలు.. యూరోప్‌కు తోడుగా ఇండియా..

Sun : సూర్యుడిపై కొత్త పరిశోధనలు.. యూరోప్‌కు తోడుగా ఇండియా..
Sun

Sun : ఇటీవల కాలంలో ఎన్నో రాకెట్లు, శాటిలైట్లు, స్పేస్‌షిప్స్ ఆకాశాన్ని చేరుకుంటున్నాయి. ప్రపంచ దేశాల స్పేస్ ఏజెన్సీలు ఒకరికి ఒకరుగా సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఒక దేశానికి సంబంధించిన రాకెట్ లాంచ్‌ను చేపట్టడానికి మరొక దేశం ముందుకొస్తోంది. అందుకే తాజాగా యూరోప్‌కు చెందిన ఒక ప్రతిష్టాత్మకమైన మిషన్‌ను పీఎస్సెల్వీ ద్వారా లాంచ్ చేయడానికి ఇస్రో ఒప్పందం చేసుకుంది. అదే ప్రోబా 3.


పీఎస్సెల్వీ అనేది ఇస్రో తయారు చేసిన ప్రతిష్టాత్మకమైన లాంచ్ వెహికిల్స్‌లో ఒకటి. ఇది ఒకేసారి ఎన్నో పేలోడ్స్‌ను ఆర్బిట్‌లోకి పంపడానికి సాయం చేస్తుంది. అందుకే యూరోప్‌కు చెందిన ప్రోబా 3ను కూడా ఆర్బిట్‌లో లాంచ్ చేయడానికి పీఎస్సెల్వీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ మిషన్ టెస్టింగ్ దశలో ఉంది. యూరోప్ తయారు చేసిన ఈ ప్రోబా 3.. ఆర్బిటల్ లేబురేటరీగా పనిచేయనుంది. ఇది రెండు స్పేస్‌క్రాఫ్ట్స్ కలిపి తయారు చేయబడుతున్న ఒక మిషన్.

2024లో ఇండియన్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్సెల్వీ) సాయంతో ప్రోబ్ 3 అంతరిక్షంలోకి ఎగరనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ప్రోబ్ 3.. స్పేస్ వాతావరణంలో ఎలా ఉంటుంది అనేదానిపై ఇంజనీర్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ ప్రోబ్ 3 మిషన్‌ను ప్రారంభించడానికి ముఖ్య కారణమేంటో యూరోప్ శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇప్పటివరకు జరగని ఒక కొత్త స్పేస్ పరిశోధనను ప్రోబ్ 3 ద్వారా చేయాలని వారు ఆశిస్తున్నారు.


సోలార్ సిస్టమ్‌లో ఉన్న గ్రహాలకంటే సూర్యుడి వెలుగు ఎక్కువగా ఉంటుంది. ఆ వెలుగే తన చుట్టూ ఉండే వాతావరణాన్ని కంట్రోల్ చేస్తుంది. అందుకే దానిని పూర్తిస్థాయిలో స్టడీ చేయడం సూర్యగ్రహణం వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ సూర్యగ్రహణం అనేది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే ప్రోబా 3కు సంబంధించిన రెండు శాటిలైట్లు.. కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ అనేవి సూర్యుడికి కొంత దూరంలో ఆర్క్ లాగా ఫార్మ్ అయ్యి దానిని గమనిస్తూ ఉంటాయి.

సూర్యుడి నుండి వెలువడే సోలార్ రిమ్‌ను గమనించడానికి ఇప్పటివరకు ఏ శాస్త్రవేత్తలు ప్రయత్నించలేదు. అందుకే ప్రోబ్ 3 ద్వారా ఆ ఘనతను సాధించాలని యూరోప్ అనుకుంటోంది. దానికి సాయంగాఇస్రో కూడా ముందడుగు వేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే సోలార్ సిస్టమ్ వాతావరణంపై సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ప్రోబా 3 నాలుగు నెలల టెస్టుల కోసం జెర్మనీకి పంపించబడింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×