BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

 Nindu Noorella Saavasam Serial Today Episode:  కారులో వెళ్తున్న అమర్‌ ఏదో ఆలోచిస్తుంటాడు. రాథోడ్ ఏంటి సార్‌ ఆలోచిస్తున్నారు. కొద్ది రోజులుగా మీరు ఎందుకో డల్లుగా ఉన్నారు సార్‌ అనగానే ఏం లేదు రాథోడ్‌. అంజు పేరెంట్స్‌ ఎవరో తెలుసుకోవాలి. కానీ ఎలా తెలుసుకోవాలో.. ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు అంటాడు. అమర్‌ మాటలకు రాథోడ్‌ షాక్‌ అవుతాడు.


ఎందుకు సార్‌ మానిపోయిన గాయాన్ని మళ్లీ రేపడం.. సమస్యను మీరు కోరి తెచ్చుకుంటున్నారు. అంజలి పాపకు ఈ నిజం తెలిస్తే తట్టుకోలేదు. ఆరోజు ఆశ్రమంలో పిల్లలను చూసే ఎమోషన్‌ అయింది. ఇప్పుడు తనే ఒక అనాథ అని తెలిస్తే అసలు బతుకుతుందా? సార్‌ అంటాడు రాథోడ్‌. కానీ ఆరు డైరీలో రాసుకుంది రాథోడ్‌. అంజలి కన్నవాళ్లు ఎవరో తెలుసుకోవాలని అరు ఆఖరి కోరిక నెరవేర్చాలని  నా ప్రయత్నం అంటాడు అమర్‌.

కొద్దిలో తప్పించుకున్న మనోహరి


  రోడ్డు పక్కన మనోహరి కారు పార్క్‌ చేసి ఉండటం చూస్తాడు అమర్‌. రాథోడ్‌ ను కారు వెళ్లమని చెప్పి వెనక్కి వెళ్లగానే మనోహరి కారు ఇక్కడ ఎందుకు ఉంది. తనకు ఇక్కడ ఏం పని అనుకుని ఫోన్‌ చేస్తాడు. మనోహరి తన ఫ్రెండును కలవడానికి కాఫీ షాపుకు వచ్చానని అబద్దం చెప్తుంది. కానీ మనోహరి అక్కడే పాడుబడిన గోడౌన్‌లో ఘోర పూజ చేస్తుంటే పూజలో కూర్చుని ఉంటుంది.

అమర్‌ ఎందుకు ఫోన్‌ చేశాడు అని మనోహరి ఆలోచిస్తుంటే.. ఏమైంది మనోహరి సమస్య ఏంటి ఎందుకు సతమతమవుతున్నావు అని ఘోర అడుగుతాడు. దీంతో  అమర్‌ సడెన్‌ గా కాల్‌ చేసి ఎక్కడ ఉన్నావని అడిగాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. తెలుసుకోవడానికి అడిగాడో.. కనుక్కోవడానికి అడిగాడో నాకు అర్థం కావడం లేదు ఘోర అంటుంది మనోహరి. అయితే  తెలుసుకోవడానికి అడిగాడేమో అంటాడు ఘోర. లేదు ఘోర ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అమర్‌ గురించి నాకు బాగా తెలుసు. కచ్చితంగా తెలుసుకోవడానికైతే కాదు. నేను ఎక్కడున్నానో తనకు ఎలా తెలుస్తుంది. నేను ఇక్కడకు వస్తున్నట్లు ఎవరికీ చెప్పలేదు కదా? అంటుంది మనోహరి.

బయట కారులో కూర్చున్న అమర్‌ మనోహరి కారు ఇక్కడ ఉంది. తనేమో ఫ్రెండును కలవడానికి కేఫ్‌ కు వెళ్లానని చెప్తుంది. కారు ఇక్కడ పెట్టి వెళ్లిందా? లేదా అబద్దం చెప్తుందా? అంటాడు అమర్‌. అంతలా ఆలోచించడం ఎందుకు సార్‌ దిగి వెతికితే సరిపోతుంది కదా? అంటూ కారు ఉన్న గోడౌన్‌ లోకి వెళ్తాడు రాథోడ్‌. లోపల ఘెర ఆరు ఆత్మను బంధించేందుకు పూజలు చేస్తుంటాడు. పూజలోంచి తీసిని ఒక తాయోత్తను మనోహరికి కడతాడు. బయట కారులో కూర్చున్న అమర్‌ రాథోడ్‌ కు ఫోన్‌ చేసి అర్జెంట్‌ కాల్‌ వచ్చింది వెళ్దాం రా అంటాడు. రాథోడ్‌ తిరిగి వెళ్లిపోతాడు. లోపల ఫోన్‌ రింగ్‌ విన్న ఘోర, మనోహరి కంగారుగా బయటకు వచ్చి చూస్తారు. అక్కడ ఎవ్వరూ కనిపించరు. అక్కడి నుంచి అమర్‌,  రాథోడ్‌ వెళ్లిపోతారు.

నిజం త్వరలోనే తెలుస్తుంది

  గార్డెన్‌ లో పిల్లలు పుట్‌ బాల్‌ ఆడుతుంటారు. పిల్లలను చూసిన ఆరు అంజలి గురించి ఆలోచిస్తుంది. అంజలికి పేరెంట్స్‌ గురించి తన మా బిడ్డ  కాదన్న విషయం తెలిసిన రోజు  ధైర్యంగా ఉండాలని దేవుణ్ని కోరుకుంటుంది. ఇంతలో గుప్త ఈ బాలికకు ఏదో గుర్తుకువస్తుంది. మళ్లీ ఏదో ఒకటి చెప్పి ఇక్కడే ఉండాలనుకుంటుంది. వెంటనే ఈ బాలిక మనసు మరల్చి మా లోకానికి తీసుకెళ్లాలి అనుకుంటాడు. బాలికా నీ పిల్ల పిచ్చుకలు ఎప్పుడూ ఇలా ఆటలు ఆడటమేనా? చదువు మీద ధ్యాస పెడతారా? అని ఆరును అడుగుతాడు.

దీంతో ఆరు  అంతటి ఆనందాన్ని, నిలువెత్తు బంగారాన్ని ఎలా వదులుకోవాలనుకున్నారు. అంజు లేని జీవితం ఊహించుకోవడమే బాధగా ఉంది. ఎవరూ మోసం చేసినా తట్టుకోగలం కానీ కన్నతల్లి మోసం చేసిందంటేనే తట్టుకోలేం కదా గుప్త గారు అంటుంది ఆరు బాధపడుతుంది. అంజలి కన్నవాళ్లను కనిపెట్టమని నేను డైరీలో రాశాను. మా ఆయన అది చదివారు. ఆయన కచ్చితంగా కనిపెడతారు అంటుంది ఆరు. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు గుప్త. అయితే నీకు నిజం తెలుసు కదా గుప్త గారు. అంజలి తల్లిందండ్రులు ఎవరో చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త నిజం తెలిసే టైం వచ్చినప్పుడే తెలుస్తుందని చెప్తాడు గుప్త.

ఆస్థి కోసం కపట ప్రేమ చూపిస్తున్నాడు

 కోర్టులో పిటీషన్‌ వేయాలని దానికి సంబంధించిన పేపర్స్‌ రెడీ చేసుకోమని లాయర్‌ కు చెప్తాడు రణవీర్‌. దీంతో పిటీషన్‌ ఏం పిటిషన్‌ అని అడుగుతాడు లాయరు. నా ఆస్థులు కాపాడుకోవడానికి లాయరు. మా నాన్న వందల కోట్ల ఆస్థులు అన్ని ఆ దుర్గ పేరు మీద రాసి చనిపోయారు. ఇప్పుడు ఆ ఆస్థులు నాకు దక్కాలంటే దుర్గను తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చాలి. అలా చేయాలంటే దుర్గ దొరకడం లేదు. కాబట్టి మళ్లీ వాయిదా ఇవ్వమని కోర్టులో పిటీషన్‌ వేయాలని చెప్తాడు. దీంతో లాయరు షాక్‌ అవుతాడు. అంటే ఇన్ని రోజులు నువ్వు దుర్గ మీద చూపించిన ప్రేమ ఈ ఆస్థుల కోసమా అని అడుగుతాడు. అవునని చెప్తాడు రణవీర్‌.

 ఆరు ఆత్మను చూసిన మనోహరి

మనోహరి ఇంట్లోంచి వస్తుంటే.. గేమ్‌ ఆడుతున్న పిల్లలు బాల్‌ ను తన్నగానే అది మనోహరి వైపు దూసుకుపోతుంది. స్పీడుగా వస్తున్న బాల్‌ ను మనోహరి పట్టుకుంటుంది. దీంతో పిల్లలందరూ గుడ్‌ క్యాచ్‌ అంటీ అంటూ మనోమరి దగ్గరకు వెల్లి బాల్‌ తీసుకుంటారు. ఇంతలో మనోహరికి ఇంట్లో ఆరు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ చెట్లు ఊగుతుంటాయి, చిన్నగా గాలి వీస్తుంది అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గేటు వైపు చెట్లు ఊగడాన్ని గమనిస్తుంది మనోహరి. వెంటనే అక్కడే ఆడుకుంటున్న పిల్లలను లోపలికి పంపించి గేటు దగ్గరకు వెళ్లి ఆరు ఆత్మను ఇక్కడే ఉంటుందని నిర్దారించుకుంటుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Big Stories

×