BigTV English

Brahmamudi Serial Today September 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌ కు అప్పు వార్నింగ్‌ – శాంత వంటకు కళ్లు బైర్లు కమ్మిన రాజ్‌

Brahmamudi Serial Today September 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సామంత్‌ కు అప్పు వార్నింగ్‌ – శాంత వంటకు కళ్లు బైర్లు కమ్మిన రాజ్‌

Brahmamudi serial today Episode :  మార్కెట్‌ నుంచి వస్తున్న కళ్యాణ్‌, అప్పలను చూసి వెటకారంగా మాట్లాడుతుంది అనామిక. తాను సామంత్‌ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు, స్వరాజ్‌ కంపెనీని మార్కెట్‌ లో పడగొడతామని చెప్తుంది. కళ్యాణ్‌ పరిస్థిఇత చూసి వెటకారంగా మాట్లాడుతుంది. నన్ను కాదన్నందుకు నీ బతుకు ఎలా రోడ్డు మీదకు వచ్చిందో చూడు అంటూ ఇన్సల్ట్‌  గా మాట్లాడుతుంది. దీంతో అప్పు కోపంగా అనామకకు వార్నింగ్‌ ఇస్తుంది. సామంత్‌ కు అనామికతో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. నీకు ఎవరైనా అమ్మాయిలు ఫ్రెండ్స్‌ ఉంటే వాళ్లతో స్నేహం వదులుకోమని లేదంటే ఇది నీకు వాళ్లతో అక్రమసంబందం అంటగట్ట కోర్టుకు ఈడ్చుతుందని భయపెడుతుంది. దీంతో సామంత్‌ ఆలోచనలో పడిపోతాడు. అనామిక, సామంత్‌ ను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.


శాంత వంట మెచ్చుకున్న రాజ్‌

రాజ్‌ నిద్ర లేచి వచ్చేసరికి హాల్లో అందరూ కాఫీ తాగుతూ ఉంటారు. ఇంట్లో కావ్య వంట చేయకపోతే అందరూ ఉపవాసం ఉండేంత బిల్డప్‌ ఇస్తున్నారు. అసలు ఈ రోజు నుంచి వీళ్లంతా కావ్యను కావ్య వంటను మర్చిపోయేలా చేయాలని అనుకుంటాడు. కిందకు వచ్చి శాంతను పిలిచి నీకు ప్రమోషన్‌ ఇస్తున్నాను. ఇక నుంచి వంట కూడా నువ్వే చేయాలని చెప్తాడు. దీంతో శాంత సంతోషంగా ఫీలవుతుంది. ఇంత త్వరగా తమరెందుకు శాంతను కరుణించారు రాజావారు ఆమెకు ప్రమోషన్‌ ప్రకటించడంలో అంతర్యమేంటో చెప్పగలరా? అంటూ ఇందిరాదేవి వెటకారంగా అడుగుతుంది. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఈ ఇంట్లో ఎవ్వరో లేకపోతే ఏదో లోటు జరుగుతుందనుకున్న వాళ్లకు శాంత వంటే సమాధానం.  ఈరోజు నుంచి ఇంట్లో శాంతనే వంట చేస్తుంది. అని రాజ్‌ చెప్పగానే  అందరూ షాక్‌ అవుతారు. కూర్చున్న చోటే నిలబడతారు. దీంతో  ఏంటి ఇంత చిన్న విషయానికి అంత స్టాండ్‌ అప్‌  అవసరమా? అని అడుగుతాడు రాజ్‌. ఎందుకు ఇంత బలమైన నిర్ణయం తీసుకున్నావు రాజ్‌ అంటూ రుద్రాణి దీనంగా ప్రశ్నిస్తుంది.  ఒక్కోక్కరూ శాంత వంట గురించి భయపడుతుంటారు. దీంతో మీకు శాంత వంట రుచి తెలియదు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. అసలు శాంత వంట ఎంత అద్బుతంగా ఉంటుందో మీకేం తెలుసు అంటాడు రాజ్‌. అవునా.. శాంత వంట నువ్వు ఎప్పుడు తిన్నావు రాజ్‌ అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. దీంతో తిన్నాడులే ఒకరోజు అంటూ చెప్తుంది అపర్ణ. ఇంతలో స్వప్న కలగజేసుకుని శాంత వంట చేస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ శాంత వంట చేయగానే ముందుగా మా అత్తకు పెట్టాలి. ఆవిడ బాగుంటేనే  మనమందరం తిందాం అంటుంది. దీంతో రుద్రాణి కోపంగా  ఏయ్‌ షటప్‌.. మీరంతా సైంటిస్టులు.. నేను ఎలుకనా..? అంటూ స్వప్నను తిడుతుంది. మీరంతా ఎందుకు టెన్షన్‌ పడతారు అత్తయ్యా ముందు నేనే తింటాను. అంటూ శాంత ఎంత బాగా వంట చేస్తుందో.. ఆ వంట రుచి ఎంత రుచిగా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు అంటాడు రాజ్‌.


 

కావ్యకు బుద్ది చెప్పమన్న కనకం

మూర్తి గణపతి విగ్రహాలు తయారు చేయడానికి మట్టిని పిసుకుతుంటాడు. ఇంతలో కావ్య వచ్చి ఈసారి ఎన్ని ఆర్డర్స్‌ వచ్చాయి నాన్నా అంటూ అడుగుతుంది. చాలా వచ్చాయి అమ్మా కానీ కొన్నే ఆర్డర్స్‌ తీసుకున్నాను అంటాడు మూర్తి. అయితే నేను మీకు సాయం చేస్తాను నాన్నా అంటుంది కావ్య. నీకెందుకమ్మా ఈ పనులు. హాయిగా ఏసీలో ఉండే ఉద్యోగం చూసుకోక.. అంటాడు. ఇంతలో ఇంట్లోంచి వచ్చిన కనకం మట్టి పిసుకుతున్న కావ్యను చూసి తిడుతుంది. భర్తతో కాపురం చేసుకోకుండా నీకెందుక ఈ పనులు అంటుంది. మూర్తిని కూడా తిడుతుంది. కూతురికి నాలుగు మంచి మాటలు చెప్పి అత్తారింటికి పంపించకుండా ఇక్కడ ఉంచుకుని పనులు చేయించుకుంటావా? అంటుంది. అయితే నువ్వు నా భార్యవే కదా నువ్వు నా మాట ఏనాడైనా విన్నావా? అలాంటిది నీ నోట్లోంచి ఊడిపడ్డ కావ్య నా మాట వింటుందని ఎలా అనుకుంటావు అంటాడు మూర్తి. అయితే మీ ఇష్టం కానీ నేను ఇవాళ అపర్ణను చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్తుంది కనకం. దీంతో కావ్య అపర్ణను గుర్తు చేసుకుని బాధపడుతుంది.

 

శాంత వంట బాధితుడిగా మిగిలిపోయిన రాజ్

శాంత చేసిన వంట తినడానికి అందరూ రెడీ అవుతారు. కానీ ముందుగా మొదలుపెట్టడానికి ఎవ్వరూ సాహసం చేయరు. శాంత అపర్ణకు వడ్డించబోతుంటే ప్రకాష్‌ ఆపి మా వదిన.. పాపం హాస్పిటల్‌ నుంచి వచ్చి రెండు రోజులు కూడా కాలేదు. కావాలంటే మా ధాన్యలక్ష్మీకి వడ్డించు అంటాడు. దీంతో అపర్ణ నీతో ఎవరైతే వంట చేయించారో వారికే ముందు వడ్డించు శాంత అని చెప్తుంది.  అబ్బాబ్బా వంటలన్నీ  ఎంత గుమగుమలాడుతున్నాయి అంటాడు. దీంతో ప్రకాష్‌ వెటకారంగా ఆ వీధి చివర ఇంజనీరు నా కారు పోకుండా బైక్‌ అడ్డంగా పెట్టాడురా. వాణ్ని కూడా పిలవరా భోజనానికి అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ చాల్లేండి మీరు మరీ చెప్తున్నారు అంటుంది. పాపం దానికి చేతనైంది అది చేసిందిరా తినక ముందే ఇన్ని రకాలుగా పేర్లు పెడితే ఎలారా? అంటుంది ఇందిరాదేవి.  శాంత నీ వంట సంగతి తెలియని వాళ్లు ఏదేదో అంటుంటారు. నీ చేతి వంట తినాలంటే పెట్టి పుట్టాలి.. ముందు నాకే వడ్డించు తర్వాత అందరికీ వడ్డించు అంటాడు రాజ్‌. శాంత కర్రీస్‌ పేర్తు చెబుతూ రాజ్‌ కు వడ్డిస్తుంది. ఆ భోజనం తిన్న రాజ్ షాక్‌ అయిపోతాడు. అందరూ ఎలా ఉంది అని అడుగుతారు. కారంతో నోరు మండిపోవడంతో రాజ్‌ గట్టిగా అరుస్తాడు. నీళ్లు అంటూ వాటర్‌ తీసుకుని తాగుతాడు. ఆరోజు అంత అద్బుతంగా వంట చేశావు ఈరోజు ఏంటి ఇలా చేశావు అని రాజ్‌ అడుగుతాడు. దీంతో అపర్ణ ఆరోజు వంట చేసింది శాంత కాదు.  కావ్య అని చెప్తుంది. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని కావ్య తీసుకురా.. లేదంటే నేను తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో  నాకే తెలియదు అంటుంది అపర్ణ

 

కంపెనీ డెవలప్‌ మెంట్‌ కోసం కావ్యను తీసుకోవాలి.

అనామిక, సామంత్‌ ఆఫీసులో కూర్చుని స్వరాజ్‌ కంపెనీని బీట్‌ చేసి మన కంపెనీ నెంబర్‌వన్‌ పొజిషన్‌ లోకి వెల్లాలి అనుకుంటారు. అలా వెల్లాలి అంటే కావ్య మన కంపెనీ కోసం పని చేయాలిన అనామిక చెప్తుంది. కావ్య మన కంపెనీలో పని చేయడానికి ఒప్పుకుంటుందా? అని సామంత్‌ అడుగుతాడు. ఒప్పుకోదు కానీ ఒకణ్ని రంగంలోకి దించితే ఒప్పుకుంటుంది అని సందీప్‌ ఫోటో చూపిస్తుంది. మేనేజర్‌ ను పిలిచి సందీప్‌ ద్వారా కావ్య మన కంపెనీ కోసం పని చేసేలా చేయండని చెప్తుంది. మరోవైపు కావ్య గణపతి విగ్రహానికి రంగులు వేస్తుంది. మూర్తి వచ్చి ఇక చాలు కావ్య చాలా టైం అయింది వెళ్లి పడుకో తల్లి అని చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ బ్రహ్మముడి సీరియల్ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Tags

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×