Satyabhama Serial Today September 21 : నిన్నటి ఎపిసోడ్ లో క్రిష్ ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది సత్య.. ఇంట్లో వాళ్లు అందరు సత్య అన్న మాటల గురించి క్రిష్ కు చెబుతారు.. ఇక నువ్వు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్స్ చెప్పారు. రా వెళదామని సత్య క్రిష్ ను బెడ్ రూమ్ కు తీసుకెళ్తుంది.. ఇక తర్వాత బెడ్ పై కూర్చోబెడుతుంది. ఏంటి సంపంగి అలా సీరియస్ గా ఉన్నావు.. నా మీద కోపమా కనీసం నా మోహం కూడా చూడట్లేదు. నేనంటే అస్సలు ఇష్టం లేదన్నట్లే చెప్పావు.. మీ నాన్న అంటే ఇష్టం అన్నావ్ నేను నీకు అవసరం లేదా అని అంటుంది. దానికి క్రిష్ నేను అలా అనలేదు. కొడుకుగా బాపును కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే అంటాడు. నువ్వు నాకో మాట ఇవ్వాలి గొడవలకు దూరంగా ఉంటాను అని చెప్పు అని ఎమోషనల్ అవుతుంది. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది.
ఇక ఈరోజు ఎపిసోడ్ లో.. సత్య బాధ పడుతుంది. క్రిష్ నేను నీకు అవసరం లేదా.. నువ్వు లేకుంటే నేను ఏమై పోవాలి. నా గురించి ఆలోచించావా.. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అంటుంది. నాకు బాపు అంటే ఇష్టం అన్నాను కానీ నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పలేదు అని క్రిష్ అంటాడు. ఇక సత్య నాకు ఓ మాట ఇస్తావా.. నువ్వు ఎప్పుడూ ఇలా గొడవలకు వెళ్లకూడదు. అని మాట ఇవ్వు అంటుంది. దానికి క్రిష్ అది కష్టం అవుతుంది సత్య. కొడుకుగా బాపు కు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అంటాడు. దాంతో ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సత్య దగ్గరకు క్రిష్ వచ్చి కూర్చుంటాడు. సత్య నేను ఇలా ఎప్పుడూ అవ్వకుండా చూసుకుంటాను. ఇప్పుడిప్పుడే గొడవలు మర్చిపోయి దగ్గర అవుతున్నాం నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెబుతాడు. ఇక బాపుకు కొడుకుగా ఆయనకు కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటానా? అని అంటాడు. దానికి సత్య మి నాన్నకు కష్టం కాదు.. కష్ఠాలను కోరి తెస్తున్నాడు అని అంటుంది. దానికి క్రిష్ మా బాపుకు ఎమ్మెల్యే అవ్వాలని కల అది తీరేవరకు నేను కాపాడుకుంటూ వస్తాను అంటాడు.
ఇక నందిని అద్ధం ముందు రెడీ అవుతూ ఉంటుంది. అంతలోకే హర్ష వస్తాడు. వెనకాల నుంచి భయపడతాడు. ది గ్రేట్ మహదేవయ్య కూతురు భయపడిందా అని అంటాడు. వెనుక నుంచి ఎవరైనా భయపడతారు. ముందు నుంచి రా మగతనం ఉంటే అంటుంది నందిని.. ఇక కాసేపు వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ జరుగుతుంది. ఇక నీకో సర్ప్రైజ్ అని మూవీ టికెట్స్ ఇస్తాడు. మూడు ఎందుకు అంటే మైత్రి కూడా వస్తుందని అంటాడు. దానికి కోపంతో రగిలిపోయిన నందిని గొడవకీ దిగుతుంది. అందులోని ఒక టికెట్ ను చించేసి వెళ్తుంది.
ఇక సత్య నువ్వు ఎంతగా మొండిగా ఉన్నా నిన్ను వదిలి పోను అని మనసులో అనుకుంటుంది. అలాగే క్రిష్ కూడా బాపు కోసమే ఇలా ఉన్నా అని మనసులో అనుకుంటాడు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ నడుస్తుంది. వీరిద్దరి మధ్య మళ్లీ ఇలాంటి సీన్ క్రియేట్ అవ్వడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక మహదేవయ్య సోఫాలో కూర్చొని ఉంటాడు. అంతలోకే పనిమనిషి వచ్చి నరసింహం జాడ తెలిసిందని చెప్తాడు. అతన్ని బొందలో పెడతాను అని కోపంగా అక్కడకు వెళతాడు.. ఇక రుద్రను వెంట పెట్టుకొని వెళ్తాడు. అక్కడకు వెళ్ళగాని అతన్ని బెదిరిస్తాడు. నిన్ను చంపాలని అనుకోలేదు నీ రక్తం పంచుకొని పుట్టిన నీ పెద్ద కొడుకే చంపాలని అనుకుంటాడని నిజం చెబుతాడు.
ఇక రుద్ర లోపల ఏమి జరుగుతుంది అని తెలుసుకోవాలని లోపలికి వెళ్తాడు.. నరసింహ కారు ఇక్కడ ఎందుకు ఉంది అంటూ ఆలోచిస్తాడు. మహదేవయ్య ఆ నిజం తెలుసుకొని షాక్ అవుతాడు. దాంతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో రుద్రను కోపంతో కోరడాతో కొడుతుంటాడు మహదేవయ్య. దాన్ని చూసి సత్య షాక్ అవుతుంది. ఇక మహదేవయ్య ఆస్తి పత్రాలను చూపించి చిన్నా పేరు మీద ఒక్కరూపాయి కూడా లేదు.. వాడు నా కడుపునా పుట్టలేదని చెబుతాడు. అది విని సత్య షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..