E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు రణవీర్‌ కొత్త ప్లాన్‌

Nindu Noorella Saavasam Serial Today November 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు రణవీర్‌ కొత్త ప్లాన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:      

కాలా చనిపోయిందని చంభా బాధపడుతుంటే.. మనోహరి వచ్చి ఇంకా పుట్టని ఆ పిండమే అంత చేస్తే మనం ఎంత చేయాలి చంభా అంటుంది. మనం ఏం చేసినా దాన్ని గెలవలేము నాకు అర్థం అయిపోయింది మనోహరి అని చెప్తుంది చంభా.. దీంతో రణవీర్‌ అలా నిరాశ చెందకు చంభా ఏదో ఒక మార్గం ఉంటుంది ఆలోచించు చంభా అంటాడు. ఏ మార్గం లేదు రణవీర్‌ దాన్ని చంపడం ఆ కాలా వల్లే కాలేదంటే ఇంకెవరి వల్ల కాదు అని చెప్తుంది. ప్రతి దానికి కచ్చితంగా ఒక పరిస్కారం ఉంటుంది అదేదో ఆలోచించు అని మనోహరి చెప్పగానే.. అన్ని అలోచించే కాలాను రప్పించాను.. నా చేతులారా నేనే నా తమ్ముణ్ని చంపుకున్నాను అని చంభా ఏడుస్తుంటే.. మనోహరి ఇరిటేటింగ్‌గా అబ్బా ఇంక ఆపుతావా..? అంటుంది.

చంభా మాత్రం నాకు ఇంకే దారి కనిపించడం లేదు అని ఏడుస్తుంది. భాగీని బయటకు రప్పిస్తే నేను ఏదో ఒకటి చేస్తాను మనోహరి. మీరు ఎలాగోలా బాగీని బయటకు తీసుకురాలేరా..? ఇన్నాళ్లు ఆస్థి కోసం పాప కోసం ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నా ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చింది. అనవసరంగా నీకు సాయం చేసి నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాను. ముగ్గురం ఇరుక్కుపోయాము.. ఇందులోంచి మనం ఎలాగైనా బయట పడాలి. మన ప్రాణాలు కాపాడుకోవాలి అని రణవీర్‌ చెప్పగానే.. మన పని అయిపోయింది రణవీర్‌.. మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చంభా చెప్తూ ఏడుస్తుంది. మనోహరి కోపంగా చంభాను తిట్టి రణవీర్‌ భాగీని బయటకు రప్పించడానికి ఒకటే దారి ఉంది.. అని చెప్పగానే.. చంభా ఏ దారి ఉంది చెప్పు మనోహరి అంటుంది.

Advertisement

సీమంతం.. భాగీని ఊరికి తీసుకెళ్లి అక్కడ దానికి సీమంతం చేయాలని వాళ్లు అనుకుంటున్నారు కదా అని మనోహరి చెప్పగానే.. అందుకు అమర్‌ ఒప్పుకున్నాడా..? అని రణవీర్‌ అడగ్గానే.. లేదు నెలలు నిండిన భాగీని అంత దూరం పంపించలేను అని చెప్పాడు.. అని మనోహరి అనగానే.. అయితే ఏదో ఒకటి చేసి అమర్‌ ను కన్వీన్స్‌ చేయలేవా..? భాగీని అక్కడికి వచ్చేలా చేయలేవా..?అని రణవీర్‌ చెప్పగానే.. సొంత మామ అడిగితేనే ఒప్పుకోలేదు అమరేంద్ర మనోహరి అడిగితే అంగీకరిస్తాడా… రణవీర్‌ అని చంభా చెప్పగానే.. మనోహరి టాలెంట్‌ నీకు తెలియదు చంభా మనోహరి అనుకుంటే ఎవరినైనా కన్వీన్స్‌ చేయగలదు.. ఏం మనోహరి అమర్‌ను ఒప్పించగలవా..? అని రణవీర్‌ అడగ్గానే..

అదే ఆలోచిస్తున్నాను అని మనోహరి చెప్తుంది.  దీంతో రణవీర్‌ ఎలాగైనా ఒప్పించు మనోహరి. ఇది మన ముగ్గురి ప్రాణాల సమస్య.. మనం అంటూ బతికి ఉంటే ఏమైనా చేయగలం.. భాగీని బయటకు రప్పిస్తే నేను కచ్చితంగా చంపేస్తాను అంటాడు రణవీర్‌. దీంతో మనోహరి సరే నేను ప్రయత్నిస్తాను అని చెప్పగానే.. ప్రయత్నించడం కాదు.. మనం బతికి ఉండాలంటే భాగీ తన బిడ్డ చావాలి.. ముందు మన ప్రాణాలే ముక్యం మనోహరి అని రణవీర్‌ చెప్పగానే.. సరే మనం వెల్దాం పద చంభా అంటూ ఇద్దరూ వెళ్లిపోతారు..

Advertisement

తర్వాత మిస్సమ్మ  బయటకు రాగానే సీమంతం జరిగే చోట బాంబు పెట్టి పేల్చి మిస్సమ్మకు చంపాలని ప్లాన్‌ చేస్తాడు రణవీర్‌. అందుకోసం ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి బాంబు కొంటాడు. అది మనోహరికి ఇస్తాడు. తర్వాత బాంబు  అమ్మిన వ్యక్తిని మిలటరీ వాళ్లు పట్టుకుంటారు. ఇదే విషయం రణవీర్‌, మనోహరికి కాల్ చేసి చెప్తాడు. ఆ బాంబు వెంటనే పేలుతుందట అని చెప్పగానే.. మనోహర షాక్‌ అవుతుంది. మరోవైపు అమర్‌ బాంబు అమ్మిన వ్యక్తిని ఇంటరాగేషన్‌ చేస్తుంటాడు. బాంబు కొన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని అడగ్గానే.. ఉంగరాల జుట్టు, రాజులా డ్రెస్‌ ఉంటుందని ఆ వ్యక్తి చెప్పగానే.. అమర్‌కు వెంటనే రణవీర్‌ గుర్తుకు వస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×