BigTV English

Nani: ఆ ఒక్క సంఘటన నా జీవితాన్ని మార్చేసింది.. ఆ పాప కోసమే..!

Nani: ఆ ఒక్క సంఘటన నా జీవితాన్ని మార్చేసింది.. ఆ పాప కోసమే..!

Nani: నేచురల్ స్టార్ నాని(Nani ) ప్రస్తుతం వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ‘కోర్ట్’ సినిమాను నిర్మించి, మంచి విజయం అందుకున్న ఈయన.. ఇప్పుడు హిట్(Hit ) ఫ్రాంచైజీ లో భాగంగా శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్ 3(Hit 3) చేసి తన ఖాతాలో మరో విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రస్తుతం సక్సెస్ జోరులో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న నాని.. మరో ఇంటర్వ్యూలో ఒక ప్రమాదం గురించి మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ ప్రమాదం తర్వాత తన జీవితమే మారిపోయిందని, ముఖ్యంగా జీవితాన్ని చూసే కోణంలో చాలా మార్పు వచ్చిందని కూడా నాని తెలిపారు. మరి నాని ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం.


నాకు రోడ్డు ప్రమాదం జరిగింది..

నాని మాట్లాడుతూ..” నేను ఒక కొత్త కార్ కొనుగోలు చేయడానికి ముందే నాకు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. నేను నా ఫ్రెండ్ కారు తీసుకుని స్నేహితులతో కలిసి హైవే పైకి డ్రైవ్ కి వెళ్ళాము. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని మా వాహనం ఢీ కొట్టింది. చీకట్లో రాత్రి సమయం కావటంతో ఏమి కనిపించని పరిస్థితి అది. రోడ్డు మధ్యలో ఆగి ఉన్న లారీని గ్రహించే లోపే మా కారుకు జరగాల్సిన ప్రమాదం జరిగింది.మా కారులోకి లారీ వెనుక భాగం చొచ్చుకొచ్చింది. అద్దం ముక్కలు కావడంతో నా శరీరం మొత్తం రక్తమే. నా పక్క సీట్లో ఉన్న స్నేహితుడు కూడా స్పృహ కోల్పోయాడు. ఏదో ఒక రకంగా అంబులెన్స్ ను రప్పించి, ఆ కారు నుంచి బయటపడి అంబులెన్స్ లో ఆసుపత్రికి వెళుతున్న సమయంలోనే మరో యాక్సిడెంట్ మా కంటపడింది”.


ఆ పాపకు జరిగిన యాక్సిడెంట్ తర్వాత నాలో మార్పు వచ్చింది..

“ఒక పెళ్లి వాహనానికి యాక్సిడెంట్ జరిగింది. అక్కడ చాలామందికి గాయాలయ్యాయి. ప్రత్యేకించి అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాపను మా అంబులెన్స్ లోనే ఎక్కించారు. ఆ పాపని చూశాక మాకు జరిగిన ప్రమాదం పెద్దగా అనిపించలేదు. ఆ పాపను ఐసీయూలో చేర్పించాము. ఇక ఆ పాపకు ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఐసియు బయటే ఉదయం వరకు నిల్చొని ఉన్నాను. ఆ ఒక్క రాత్రి నన్ను ఎంతో మార్చేసింది. ఇక అప్పటినుంచి జీవితాన్ని చూసే విధానం కూడా మారిపోయింది. మనం భూమి మీద ఉండే ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదించాలి.. సంతోషంగా జీవించాలి అని అప్పుడే నిర్ణయించుకున్నాను” అంటూ నాని ఆ ఒక్క రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక ప్రమాదం తర్వాత తాను కారు నడిపింది చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే అంటూ కూడా తెలిపారు. మొత్తానికైతే నానికి యాక్సిడెంట్ అయిందని, యాక్సిడెంట్ తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని కూడా నాని చెప్పుకొచ్చారు . ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ల కారణంగానే తమలో మార్పు తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు నాని కూడా అలాగే తనలో ఆ మార్పు పరివర్తనం చెంది తనను మనిషిగా మార్చిందని కూడా చెప్పుకొచ్చారు.

ALSO READ:Nagarjuna: అలా చేయొద్దంటూ.. శోభితాకి వార్నింగ్ ఇచ్చిన మామ..!

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×