Nagarjuna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏఎన్నార్ (ANR ) తర్వాత ఆయన సినీ వారసత్వాన్ని ఆయన వారసుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కొనసాగిస్తున్నారు. ఇకపోతే నాగార్జున రేంజ్ లో ఆయన కొడుకులు నాగ చైతన్య (Naga Chaitanya), అఖిల్ అక్కినేని(Akhil Akkineni) సక్సెస్ కాలేదని చెప్పాలి. అటు అడపా దడపా సినిమాలతో నాగచైతన్య పర్వాలేదనిపించినా.. అఖిల్ మాత్రం సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య.. సమంత (Samantha ) నుంచి విడిపోయిన తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobhita dhulipala) ను ప్రేమించి మరీ గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
శోభిత ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వైరల్..
వివాహం తర్వాత భార్యతో కలిసి టూర్లు, వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో నాగార్జున తన కోడలు శోభిత, కొడుకు నాగచైతన్య కి కండిషన్ పెడుతూనే.. స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు నాగార్జున ఇలాంటి పనులు ఎప్పుడు చేయరు..? అలాంటిది ఎందుకు వీరికి కండిషన్ పెట్టారు? ఏమని పెట్టారు? వీరికి వార్నింగ్ ఇవ్వాల్సిన పని ఏముంది..?అసలు ఏం జరిగింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మరి అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా శోభిత ధూళిపాల ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త ఇక హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తపై అక్కినేని ఫ్యామిలీ స్పందించకపోవడంతో బహుశా ఇది నిజమే అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు.
కోడలికి అలాంటి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..
ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వార్తపై ఏ విధంగా కూడా రియాక్ట్ కావొద్దు అంటూ నాగార్జుననే స్వయంగా నాగచైతన్య, శోభిత దూళిపాలకు స్ట్రిక్ట్గా చెప్పుకొచ్చారట. ఒకవేళ ఇప్పుడు ఈ వార్తపై రియాక్ట్ అయితే ఫ్యూచర్లో ఇలాంటి వార్తలు ఇంకా వస్తూనే ఉంటాయి.. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలలో నిజం లేదని చెప్పినా సరే మీపై నెగటివ్ ట్రోలింగ్ జరుగుతుంది..ఇప్పుడిప్పుడే నాగచైతన్య కెరియర్ సెటిల్ అవుతున్న సందర్భంలో నాగచైతన్య ఫ్యామిలీ పరంగా నెగిటివ్ కామెంట్స్ అందుకుంటే ఆయన కెరియర్ కు మైనస్ గా మారుతుంది.. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రూమర్స్ ఎన్ని వచ్చినా స్పందించొద్దని కండిషన్ తో పాటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారట నాగార్జున. మొత్తానికి అయితే కొడుకు కోడలికి బాగానే కండిషన్లు పెట్టి వారి కెరియర్ అభివృద్ధికి పాటుపడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు నాగార్జున మాత్రం ఇలాంటి కండిషన్లు పెట్టారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగార్జున విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ (Dhanush) ‘కుబేర’ తో పాటు రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇకపోతే ఈయన తోటి హీరోలంతా వరుసగా సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ అందుకుంటుంటే.. నాగార్జున మాత్రం ఇలా ఇతర హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తుండడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి నాగార్జున ఎప్పుడు మూవీ ప్రకటిస్తారో చూడాలి.
ALSO READ:Kingdom First Review: ఫస్ట్ రివ్యూ పంచుకున్న అనిరుధ్.. విజయ్ దేవరకొండ గట్టెక్కుతాడా..?