RCB vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… శనివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Chennai Super Kings vs Royal Challengers Bangalore ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఈ ఓటమి నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐదు కప్పులు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించామని విర్రవీగారు.
Also Read: CSK VS RCB: కోహ్లీ చెత్త ఫీల్డింగ్…CSK చేసిన తప్పిదం ఇదే.. RCB రియల్ హీరో యశ్ దయాల్
బెంగళూరు ఫాన్స్ కు చుక్కలు చూపించిన చెన్నై కుర్రాడు
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ పూర్తయిన తర్వాత…. కోహ్లీ అభిమానులు అలాగే బెంగళూరు ఫ్యాన్స్ రెచ్చిపోయి ప్రవర్తించారు. ఈ నేపథ్యంలోనే స్టేడియం బయట చెన్నై కుర్రాడిని పట్టుకొని కొట్టబోయారు. అయితే.. ఈ సందర్భంగా దాదాపు 500 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు వాళ్ళ జెర్సీ ధరించుకొని రెచ్చిపోయారు. చెన్నై కుర్రాడిని ఒక్కడిని చేసి కొట్టబోయారు. పోలీసులు ఉండగానే ఈ సంఘటన జరిగింది.
అయితే 500 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ వచ్చిన ఆ ఒక్క కుర్రాడు… వాళ్లపై ఎగబడ్డాడు. ఓవరాక్షన్ చేస్తే… మీ తాటతీస్తానంటూ వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. ఎల్లో జెర్సీ వేసుకొని… రాయల్ చాలెంజెస్ బెంగళూరు ఫ్యాన్స్ కు చుక్కలు చూపించాడు. అయితే అంతలోనే పోలీసులు వెంటనే ఆ చెన్నై కుర్రాడిని అక్కడ నుంచి తీసుకువెళ్లారు. పోలీసులు వచ్చినప్పటికీ కూడా… ఆ చెన్నై కుర్రాడు తగ్గలేదు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్.. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఏం గుండరా వాడిది… 500 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉన్నప్పటికీ.. వాళ్లను ఒక్కడే బెదిరించడానికి కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజెస్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో… 211 పరుగులు చేసింది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ప్లే ఆఫ్ కు వెళ్లిన మొదటి జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రికార్డు సృష్టించింది. గత 17 సంవత్సరాలుగా ఒక్క కప్పు కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… ఈసారి ప్లే ఆఫ్ కు వెళ్లడం గమనార్హం.
Also Read: IPL Players Like Celebrities : ఐపీఎల్ 2025 లో టాలీవుడ్ హీరోలు… మొత్తం అచ్చుగుద్దారు
— Out Of Context Cricket (@GemsOfCricket) May 4, 2025