Open Science : ఈరోజుల్లో చాలామందికి సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెరుగుతోంది. దానిపై పూర్తిగా అవగాహన లేకపోయినా ఈ విభాగంలో జరిగే పరిశోధనల్లో భగమవ్వాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటి వారికోసమే శాస్త్రవేత్తలు సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడం, సైన్స్ ఎగ్జిబిషన్లు పెట్టడం లాంటి నూతన ఆలోచనలతో ముందుకొస్తారు. అంతే కాకుండా మరో అడుగు ముందుకి వేసి వారి నుండి పెట్టుబడులు కూడా ఆహ్వానించడం మొదలుపెట్టారు. తాజాగా ఒక దేశం ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే చాలావరకు ప్రైవేట్ సంస్థల్లో షేర్ హోల్డర్స్ అనే పద్ధతి ఆచరణలో ఉంది. ఐటీతో పాటు మరెన్నో ఇతర రంగాల్లో కూడా ఈ పద్ధతి ఉంది. సంస్థలకు, ప్రజలకి మధ్య దూరం తగ్గించడానికి, లాభాలు పెంచుకోవడానికి సంస్థలు ఈ షేర్ల పద్ధతిని మొదలుపెట్టాయి. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో కూడా షేర్ల పద్ధతిని ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పటికే ఎన్నో ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రభుత్వాలు కూడా అనుకున్నాయి. ముందుగా యూరోప్ ఈ పద్ధతిని ప్రారంభించనుంది. దీనికి ఓపెన్ సైన్స్ అని పేరు కూడా పెట్టింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ప్రభుత్వానికి ఫండింగ్ పరంగా సహాయం చేయడానికి యూరోప్ లోని స్టేక్ హోల్డర్స్, పరిశోధకులు, పాలసీ మేకర్స్ కలసి ఓపెన్ సైన్స్ అనే ఆలోచనని ముందుకి తీసుకోచ్చారు. పరిశోధనలను అందరికి చేరువ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు కూడా ఉంటాయని నిపణులు హెచ్చరిస్తున్నారు. ముందుగా ఫెబ్రవరిలో శాస్త్రవేత్తలు ఈ ఆలోచన చేశారు. ఓపెన్ సైన్స్ ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ సైన్స్ అనేది ఉంది. కానీ పూర్తిగా దాని గురించి అందరికీ అవగాహన లేదు. అందుకే దీని గురించి గైడ్ పూర్తిగా పాలసీ అనేది ఏర్పాటు కాలేదు. ఓపెన్ సైన్స్ అనేది ప్రపంచ దేశాలు విడివిడిగా చేసిన పరిశోధనలు ఒకచోట చేర్చి ప్రపంచవ్యాప్తంగా మానవాళికి లాభం చేకూర్చడమే అని యునెస్కో అంటోంది. దీని వల్ల సైన్స్ పరంగా దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని తెలుస్తోంది. ఇప్పుడు ఈ పద్ధతిని అధికారికంగా ప్రారంభించాలని యూరోప్ అనుకుంటోంది. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో మార్కెట్లోకి రానుంది.