BigTV English

IND vs AUS: 480 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్.. 6 వికెట్లు తీసిన అశ్విన్

IND vs AUS: 480 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్.. 6 వికెట్లు తీసిన అశ్విన్

IND vs AUS: అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ సెంచరీలు సాధించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ సాధించింది. భారత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న ఖవాజా 422 బంతులను ఎదుర్కొని 21 ఫోర్ల సాయంతో 180 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన ఆల్ రౌండర్ గ్రీన్ 170 బంతుల్లో 18 ఫోర్లతో 114 పరుగులు సాధించాడు.


తొలిరోజు ఒకదశలో ఆసీస్ 170 పరుగులకే నాలుగు వికెట్లు పోగొట్టుకుంది. ట్రావీస్ హెడ్ (32), మార్నస్ లబుషేన్ (3), కెప్టెన్ స్టివ్ స్మిత్ (38), పీటర్ హ్యాండ్స్ కాబ్ ( 17) వికెట్లను తొలిరోజు చేజార్చుకుంది. ఓవర్ నైట్ స్కోర్ 254/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా అదో జోరు కొనసాగించింది. తొలి రోజు సెంచరీ పూర్తి చేసిన ఖవాజా రెండో రోజూ అదే జోరు కొనసాగించాడు. క్రితం రోజు 49 పరుగులు చేసి గ్రీన్ రెండో రోజు రెచ్చిపోయాడు. సెంచరీతో అదరగొట్టాడు. 5వ వికెట్ కు ఖవాజా, గ్రీన్ కలిసి 208 పరుగులు జోడించారు. అయితే ఆ తర్వాత 31 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది ఆసీస్. చివరకు ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత్ బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టాడు. షమీకి 2, జడేజా , అక్షర్ పటేల్‌కు తలో వికెట్ దక్కాయి. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్లు ఏమీ కోల్పోకుండా 36 పరుగులు చేసింది.


Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×