E-Paper
Advertisement

Oppo A6s 5G: ఒప్పో A6s 5G స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఒక్క ఛార్జ్ కు 882 గంటలు ఆన్.. రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్

Oppo A6s 5G: ఒప్పో A6s 5G స్మార్ట్ ఫోన్ లాంచ్..  ఒక్క ఛార్జ్ కు 882 గంటలు ఆన్.. రూ.1000 క్యాష్ బ్యాక్ ఆఫర్
Advertisement

Oppo A6s 5G: ఒప్పో A6s 5G స్మార్ట్ ఫోన్ బుధవారం భారత్ మార్కెట్ లో లాంచ్ అయింది. ఈ A సిరీస్ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్లలో లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఒప్పో A6s 5G బుధవారం భారతదేశంలో విడుదలైంది. ఇది గరిష్టంగా 882.1 గంటల స్టాండ్‌బై ఆన్, 22.4 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. కొత్తగా విడుదలైన ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది.

ఒప్పో A6s 5G ధరలు, ఆఫర్లు

  • ఒప్పో A6s 5G 4GB+128GB వేరియంట్ ధర రూ. 18,999
  • 6GB RAM+128GB స్టోరేజ్‌ టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 20,999
  • ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో స్టోర్, రిటైల్ అవుట్‌లెట్‌లలో అరోరా గోల్డ్, ప్లమ్ పర్పుల్ కలర్స్ లో అమ్మకానికి రెడీ అయింది. ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డ్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, BoB కార్డ్స్, Yes బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ సహా ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై మూడు నెలల నో కాస్ట్ EMI సదుపాయం అందిస్తోంది.

ఒప్పో A6s 5G స్పెసిఫికేషన్లు

ఒప్పో A6s 5G కలర్‌ ఓఎస్ 15తో పనిచేస్తుంది. ఇందులో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ గల 6.75-అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే గరిష్టంగా 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పాటు 6GB వరకు RAM, 128GB స్టోరేజ్‌తో పనిచేస్తుంది. గేమింగ్‌ ఎక్స్ పీరియన్స్ కోసం AI గేమ్‌బూస్ట్ ఫీచర్‌కు, నెట్‌వర్క్ తక్కువగా ఉండే ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీ కోసం AI లింక్‌బూస్ట్ 3.0 ఫీచర్‌ అందుబాటులో ఉంది.

Advertisement

Also Read:  7000mAh బ్యాటరీ, 50MP కెమెరాగల ఒప్పో ఫోన్‌పై రూ.11500 డిస్కౌంట్.. బంపర్ ఆఫర్ ఎక్కడంటే

కెమెరా ఫీచర్లు

ఒప్పో A6s 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ ఉంది. ఈ ఫోన్‌లో కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5G, బ్లూటూత్, జీపీఎస్, వై-ఫై, USB టైప్-C ఛార్జర్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీ ఉంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 882.1 గంటల ఆన్ లో ఉంటుంది. వీడియోలు చూస్తే 22.4 గంటల పాటు పనిచేస్తుంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండడంతో వల్ల 30 నిమిషాల్లో ఛార్జింగ్ 1 శాతం నుండి 41 శాతానికి ఎక్కుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 8.61 mm మందంతో, సుమారుగా 212g బరువుతో లభిస్తుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×