BigTV English

Pakistan:-నెరవేరని పాకిస్థాన్ కలలు.. స్పేస్ సెంటర్‌కు ఎదురుదెబ్బ..

Pakistan:-నెరవేరని పాకిస్థాన్ కలలు.. స్పేస్ సెంటర్‌కు ఎదురుదెబ్బ..

Pakistan:-స్పేస్ టెక్నాలజీ విషయంలో ఎన్నో దేశాలు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. సరిపడా వనరులు లేకపోయినా కూడా.. అందుబాటులో ఉన్న వనరులతోనే ఆస్ట్రానాట్స్ ప్రయోగాలు చేపడుతూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇప్పటికే 2023లో ఎన్నో దేశాలు స్పేస్ టెక్నాలజీపై దృష్టిపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదిలా ఉండగా మరికొన్ని దేశాలు మాత్రం ఈ రంగంలో మొదటి అడుగు కూడా వేయలేకపోతున్నాయి. అందులో ఒకటి పాకిస్థాన్.


అంతరిక్షంలో స్పేప్ అబ్జర్వేటరీ పెట్టాలని పాకిస్థాన్ ఎప్పటినుండో సన్నాహాలు చేస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన పరిశోధనల్లో వేగం పెంచారు శాస్త్రవేత్తలు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారి వారి ఆశలన్నింటికి చెక్ పడింది. పాకిస్థాన్ స్పేస్ ఫౌండేషన్ (పీఎస్ఎఫ్) అసమర్థత వల్లే ఇలా జరిగిందని ప్రభుత్వం విమర్శిస్తుంటే.. పీఎస్ఎఫ్ మాత్రం తమ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్‌పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల పాకిస్థాన్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడనుందని పీఎస్ఎఫ్ ఛైర్మన్ షాహిద్ బైగ్ అన్నారు.

ప్రభుత్వం విషయంలో మార్పులు రాకపోయింటే.. ఎకానమీపై ఎఫెక్ట్ పడుండేది కాదని, ఆ ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని షాహిద్ విమర్శించారు. ముందుగా 2021 ఏప్రిల్‌లో అబ్జర్వేటరీ ప్లాన్‌కు శ్రీకారం జరిగింది. ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత వారు ముందుగా వేసుకున్న ప్లాన్‌లో చాలా మార్పులు జరిగాయి. దీని కారణంగా దిగుమతి శాతం పెరిగింది. అబ్జర్వేటరీకి కావాల్సిన పరికరాలను దిగుమతి చేసుకోవడానికి మాత్రమే పాకిస్థాన్ 20 మిలియన్లను ఖర్చు పెట్టింది.


ముందుగా ఈ స్పేస్ అబ్జర్వేటరీకి కావాల్సిన పరికరాలు విలువ 15 మిలియన్లు ఉండగా.. తరువాత అది 20 మిలియన్లకు పెరిగింది. యూఎస్ డాలర్ విలువ ఉన్నట్టుండి పెరగడం కూడా దీనికి ఒక కారణమే. అందుకే అబ్జర్వేటరీకి కావాల్సిన పరికరాలను పీఎస్ఎఫ్.. తన నిధుల నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఉన్నట్టుండి ప్రభుత్వం మారడంతో.. ప్రాజెక్ట్‌కు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. అలా జరగకపోయింటే ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తయ్యేదని షాహిద్ బైగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గతేడాది ఏప్రిల్‌లో పాకిస్థాన్‌లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అందుకే అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఒక్కసారిగా తన పదవి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత షెహ్బాజ్ షరీఫ్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇమ్రాన్ ఖాన్ పదవి నుండి తప్పుకొని షెహ్బాజ్ ప్రధాని అవ్వడం వెనుక ఇతర దేశాల పతకం కూడా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇక హెహ్బాజ్ ప్రధాని అయిన తర్వాత పీఎస్ఎఫ్‌తో పాటు ఎన్నో ఇతర విభాగాలపై కూడా ఎఫెక్ట్ పడింది.

అమెరికాకు వలసవెళుతున్న ఇండియన్లపై స్టడీ..

Tags

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×